ఎన్నికల సంఘానికి సుహాసిని ఫిర్యాదు

Nandamuri Suhashini, EC, Kukatpally TDP Candidate, Madhavaram Krishna Rao

హైదరాబాద్‌: కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కూకట్‌పల్లి టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు పోలీసులు సహకరిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు, కూకట్‌పల్లి ఏసీపీ సురేంద్ర టీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సుహాసిని ఆరోపించారు.

ప్రలోభాలకు పాల్పడకుండా ఉండాలటే ఆ అధికారులను బదిలీ చేయాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబానికి చెందిన మహిళలను టీఆర్ఎస్ కార్యకర్తలు బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. కూకట్‌పల్లి పరిధిలోని అల్లాపూర్‌, ఓల్డ్‌ బోయిన్‌పల్లి ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

సంబంధిత వార్తలు