పరువునష్టం కేసు వేసిన ఎంజే అక్బర్

Updated By ManamMon, 10/15/2018 - 19:52
Mr Akbar filed  defamation case against Journalist Priya Ramani
  • ప్రియా రమణిపై పరువు నష్టం కేసు

  • కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ దాఖలు 

  • లైంగిక ఆరోపణల నేపథ్యంలో కేసు

Mr Akbar filed  defamation case against Journalist Priya Ramani

న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ న్యాయపరమైన చర్యలకు దిగారు. తనపై ఆరోపణలు చేసిన జర్నలిస్టు ప్రియా రమణిపై ఆయన పరువు నష్టం కేసు చేశారు. ‘మీ టూ’ ఉద్యమంలో భాగంగా 12 మంది మహిళలు ఆయనపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 

విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చిన అక్బర్.. ఇవన్నీ నిరాధార ఆరోపణలని, వారిపై న్యాయుపరైమెన చర్యలు తీసుకుంటానని, న్యాయవాదులు ఈ విషయం చూసుకుంటారని చెప్పారు. అక్బర్‌పై మొదటసారిగా ఆరోపణలు చేసిన జర్నలిస్టు ప్రియా రమణిపై ఆయన తరపు న్యాయవాదులు సోమవారం పాటియాల హౌజ్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేశారని, ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఇలాంటి ఆరోపణలు చేయడం వెనుక కుట్ర దాగుందని ఆరోపించారు. రాజకీయాల్లోకి రాకముందు కొన్ని పత్రికలకు ఎడిటర్‌గా పనిచేసిన అక్బర్‌పై ఈ నెల 8న ప్రియా రమణి ఆరోపణలు చేశారు. 

గత ఏడాది ప్రియా రమణి ఓ ఇంటర్వ్యూలో తనపై గతంలో ఓ ప్రముఖ జర్నలిస్టు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపించారు. గత వారం ఆ వ్యక్తి ఎంజే అక్బర్ అంటూ ఆమె ప్రకటించడం సంచలనమైంది. ఆ తర్వాత మరో పది మంది మహిళలు మంత్రిపై ఇలాంటి ఆరోపణలే చేశారు. దీంతో అక్బర్ రాజీనామా చేయాలంటూ విపక్షాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. 

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీ టూ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ.. అక్బర్ పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీకి తిరిగొచ్చిన ఎంజే అక్బర్ తనపై వచ్చిన ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదని చెప్పారు. న్యాయవాదులతో చర్చించి, ప్రియా రమణిపై పరువు నష్టం కేసు వేశారు. 

English Title
Mr Akbar filed defamation case against Journalist Priya Ramani
Related News