తీవ్ర అస్వస్థతకు గురైన మోత్కుపల్లి

Motkupalli Narasimhulu

హైదరాబాద్: టీడీపీ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత అర్ధరాత్రి ఆయనకు వాంతులు, ఛాతినొప్పి రావడంతో హుటాహుటిన భువనగిరి ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన పరిస్థితిపై వైద్యులు ఇంకా ఏ సమాచారం వెల్లడించలేదు.

అయితే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థిగా మోత్కుపల్లి పోటీ చేస్తున్నారు. ఇవాళ ఓటింగ్ జరుగుతుండగా.. అంతలోపే ఆయన తీవ్ర అస్వస్థతకు గురి అవ్వడంతో కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు