ముస్లింల అభివృద్ధికి మోదీ కృషి

Updated By ManamWed, 06/13/2018 - 23:03
laxman
  • పలు సంక్షేమ పథకాల అమలు: లక్ష్మణ్  

laxmanహైదరాబాద్: ముస్లిం సోదర సోదరీమణుల అభివృద్ధి, సంక్షేమానికి మోదీ సర్కారు పలు కార్యక్రమాలను అమలుచేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. ముఖ్యంగా ట్రిపుల్ తలాక్ బిల్లు తీసుకువచ్చి ముస్లిం సోదరీమణులకు తోడ్పాటునందించే ప్రయత్నం చేసిందని  ఆయన తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముషీరాబాద్‌లో పలువురు ముస్లిం మహిళలకు డాక్టర్ లక్ష్మణ్ రంజాన్ బహుమతులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనారిటీ సోదరులకు కేంద్రం ప్రత్యేక  విద్యాసంస్థలు ఏర్పాటుచేసి ఉచిత విద్య అందిస్తున్నదని, అలాగే ఉన్నత విద్యను అభ్యసించే ముస్లిం విద్యార్థులకు భారీ ఎత్తున స్కాలర్ షిప్‌లను అందిస్తున్నదన్నారు. ముస్లిం మహిళలను హజ్ యాత్రకు ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇస్తుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని లక్ష్మణ్ సూచించారు.

English Title
Modi's efforts for the development of Muslims
Related News