శ్రీలంక ప్రధానితో మోదీ భేటీ

Updated By ManamSun, 10/21/2018 - 00:47
Modi
  • పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు.. నిర్మాణ ప్రాజెక్టులపై ప్రధాన దృష్టి  

న్యూఢిల్లీ: శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘెతో ప్రధాని నరేంద్రమోదీ పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. భారత్ సాయంతో శ్రీలంకలో నిర్మిస్తున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులైపె కూడా వీరి చర్చలు సాగాయి. విక్రమసింఘె పర్యటన చివరి రోజున వారిద్దరు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో చర్చించారు. భారతీయుల హృదయాల్లో శ్రీలంకకు ప్రత్యేక స్థానం ఉందని, నాయకులిద్దరూ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిది రవీష్ కుమార్ ట్వీట్ చేశారు. జాఫ్నాలో భారత సాయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే తమిళులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అధికార పంపిణీ గురించి కూడా మాట్లాడారంటున్నారు.

image


శ్రీలంక అధ్యక్షుడు వైుత్రిపాల సిరిసేనను హతమార్చేందుకు భారత నిగా సంస్థ రా కుట్ర పన్నినట్లు పత్రికలలో కథనాలు రావడం, వాటిని తప్పుడు కథనాలుగా శ్రీలంక పేర్కొన్న నేపథ్యంలో రణిల్ విక్రమసింఘె పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అంతకుముందు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా శ్రీలంక ప్రధానిని కలిశారు. మూడు రోజుల పర్యటన కోసం విక్రమసింఘె గురువారం భారతదేశానికి వచ్చారు. శుక్రవారం ఆయనను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ తదితరులు కలిసి ఇరు దేశాల మధ్య సహకారంపై చర్చించారు. 

English Title
Modi met with Sri Lanka Prime Minister
Related News