మెక్సికో సంచలనం

Updated By ManamMon, 06/18/2018 - 01:20
mexco
  • జర్మనీపై 1-0 గోల్స్‌తో విజయం

mexco-4మాస్కో: ప్రపంచ కప్ ఫుట్‌బాల్‌లో పెను సంచలనం నమోదైంది. డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నంబర్ వన్ జర్మనీ తొలి మ్యాచ్‌లోనే చిత్తయింది.  అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ అద్భుతంగా ఆడిన మెక్సికో జర్మనీపై 1-0 గోల్స్‌తో విజయం సాధించింది.  ఆదివారం గ్రూప్-ఎఫ్ తొలి మ్యాచ్‌లో మెక్సికో అద్భుతమైన ఆటతో చాంపియన్ జర్మనీకి చెమటలుపట్టించింది .మాస్కోలో కిక్కిరిసిన లుజ్నికి స్టేడియంలో వేలాది మంది సొంత ప్రేక్షకుల మధ్య జర్మనీకి మెక్సికో షాక్ ఇచ్చింది. ఏ మాత్రం సరితూగదనుకున్న మెక్సికో ఈ విజయంతో 2017  కన్ఫెడరేషన్ కప్‌లో ఓటమికి జర్మనీపై ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.  ప్రపంచ ఫుట్‌బాల్ ర్యాంకుల్లో 15వ స్థానంలో ఉన్న మెక్సికో  ఈ మ్యాచ్‌లో  ఆట ఆరంభం నుంచే పైచేయి ప్రదర్శించిన జర్మనీ దూకుడుకు అడుగడుగనా చెక్ పెట్టింది. క్రమేపీ ఆటలో వేగం పెంచిన మెక్సికో ఆటగాళ్లు జర్మనీపై ఆధిక్యత ప్రదర్శించారు. 

పలుమార్లు ప్రీ కిక్‌ను వృధా చేసుకున్నప్పటికీ 35వ నిమిషంలో మెక్సికో ఉత్కంఠతకు తెరదించింది. హిర్వింగ్ లొజానో  అద్భుతమైన గోల్‌తో మెక్సికో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.  మెక్సికో ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న జర్మనీ ఆ తర్వాత పలుమార్లు గోల్ చేసే ప్రయత్నాలు చేసినా వృధా అయ్యాయి. ప్రథమార్థభాగం ముగిసే సరికి మెక్సికో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.  జర్మనీ వ్యూహాన్ని దెబ్బతీసేందుకు మెక్సికో కోచ్  ఎటాకింగ్ త్రయం లోజానో,  జేవియర్ ఫెర్నాండెజ్, కార్లోస్ వెలాను బరిలోకి  దించాడు.  జర్మనీ ఫలితాన్ని శాసిస్తాడనుకున్న స్టార్ ప్లేయర్ నెయుర్ ఎనిమిది నెలల విరామం తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టినా ఫలితం లేకపోయింది. సెకండాఫ్‌లోనూ జర్మనీ ప్రయత్నాలు వృధా అయ్యాయి. మొత్తంగా 14 సార్లు గోల్ చేసేందుకు జర్మనీ ప్రయత్నించి విఫలమైంది. 

క్రొయేషియా శుభారంభం
ఫిఫా ప్రపంచకప్ గ్రూప్-డిలో క్రొయేషియా జట్టు బోణీ కొట్టింది. నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో 2-0 గోల్స్‌తో విజయం సాధించింది.   మెగా టోర్నీల్లో నిలకడగా ఆడుతూ వస్తోన్న నైజీరియా కీలక పోరులో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది.  డిఫెన్స్ బలహీనంగా ఉండటంతో నైజీరియా పరాజయం చూడాల్సి వచ్చింది.  ప్రథమార్థంలో ఓజెనీకరో ఎతిబో సొంతంగా గోల్ చేయడంతో క్రొయేషియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 
అనంతరం ద్వితీయార్థంలో 70వ నిమిషయంలో నైజీరియా ప్లేయర్ విలియమ్ ఫౌల్ చేయడంతో క్రోయేషియాకు పెనాల్టీ లభించింది. 71వ నిమిషయంలో పెనాల్టీని ఉపయోగించుకున్న లుకా మోద్రిక్ స్పాట్ కిక్‌తో గోల్‌కొట్టి జట్టును విజయపథంలో నడిపించాడు. ఈ విజయంతో గ్రూప్-డిలో క్రొయేషియానే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

ప్రపంచ కప్‌లో నేడు
గ్రూప్ ఎఫ్ స్వీడన్ X కొరియా  సా.5.30 
గ్రూప్ జి బెల్జియం X పనామా  రా.8.30
గ్రూప్ జి ట్యునీషియా X ఇంగ్లండ్  రా.11.30

Tags
English Title
Mexico sensation
Related News