క్రిష్‌కు సడన్ షాకిచ్చిన రామోజీరావు..!

Updated By ManamWed, 07/11/2018 - 20:52
ntr biopic

ntr biopic

అవును మీరు వింటున్నది నిజమే.. డైరెక్టర్ క్రిష్‌కు మీడియా మొఘల్ రామోజీరావు సడన్ షాకిచ్చారు.! దివంగత ముఖ్యమంత్రి, అన్నగారు.. ఎన్టీఆర్ బయోపిక్‌‌ను డైరెక్టర్ తేజ వదిలేసిన అనంతరం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే క్రిష్ షూటింగ్‌ మొదలెట్టేశారు కూడా. అయితే బుధవారం షూటింగ్ స్పాట్‌లో రామోజీరావు ప్రత్యక్షమవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అసలేం జరుగుతోంది..?.. ఆయన సడన్‌‌గా ఎందుకు ఎంట్రీ ఇచ్చారు..? అని లొకేషన్‌లో ఉన్న వాళ్లంతా షాకయ్యారు.!

షూటింగ్ స్పాట్‌లో.. అసలేం జరిగిందనే విషయాన్ని క్రిష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా క్లారిటీ ఇచ్చారు. "ఎన్టీఆర్ సెట్స్‌లో రామోజీరావును కలిసిన అద్భుత క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను. మా యూనిట్ అంతా సంభ్రమాశ్చర్యానికి గురైంది. అరగంటసేపు ఆయనతో గడిపే అవకాశం దక్కింది. ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. థ్యాంక్యూ సో మచ్" అని రామోజీతో ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. 

మొత్తానికి చూస్తే.. రామోజీరావు కూడా ఈ సినిమా విషయంలో క్రిష్‌కు సూచనలు, సలహాలు ఇచ్చారన్న మాట. ఇదిలా ఉంటే.. రామోజీ రాకతో డైరెక్టర్ ఆనందం ఉబ్బితబ్బిబవుతున్నారు..! ఒక్కమాటలో చెప్పాలంటే క్రిష్ ఆనందానికి అవధుల్లేవన్న విషయం ట్విట్టర్ పోస్ట్‌తో స్పష్టంగా అర్థమవుతోంది. కాగా సోషల్ మీడియా వేదికగా క్రిష్ ట్వీట్‌పై నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎన్టీఆర్ సీఎం అవ్వడానికి.. సీఎం సీటు నుంచి దిగడానికి ఎవరెవరు ముఖ్యపాత్ర పోషించారన్న విషయాలు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

నెటిజన్ల కామెంట్స్ ఇవీ..
:-‘ కానీ.. ఎన్టీఆర్ చివరి రోజుల్లో రామోజీ పేరుని తన నోటితో పలకడానికి కూడా అసహ్యించుకున్నాడు.. తెలుసా క్రిష్...’
:- రామోజీ రావ్ గారు.. తన క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారో.. చూద్దాం అని వచ్చారేమో..!!?
:- రామోజీగారి క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు..? చాలా యాక్సైంటీగా ఉంది..! అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కాగా.. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వారాహి చలనచిత్ర, విబ్రి మీడియా సమర్పణలో సాయి కొర్రపాటి, విష్ణు వర్థన్ ఇందూరి, నందమూరి బాలకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్‌లో ‘కుచ్ కుచ్ హోతా హై’ నుంచి నిన్నటి ‘రుస్తుం’ వరకు ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన సంతోష్ తుండియల్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, బుర్రా సాయిమాధవ్ మాటలు అందిస్తున్నారు. 

 

English Title
Media Mughal Ramoji Rao Gives Sudden Shock To Director Krish
Related News