షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డ నటి

Manju Warrier

ప్రముఖ మలయాళ నటి మంజూ వారియర్ తీవ్రంగా గాయపడ్డారు. సంతోశ్ శివన్ దర్శకత్వంలో మంజూ వారియర్ జాక్ అండ్ జిల్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో మంజూ పాల్గొనగా.. యాక్షన్ సన్నివేశాలలో ఆమె తలకు బలమైన గాయమైంది. దీంతో వెంటనే యూనిట్ సభ్యులు ఆసుపత్రికి తలరించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, ఆమె గాయానికి కుట్టు వేశారని.. మంజు కోలుకున్న తరువాతే షూటింగ్ ప్రారంభించనున్నామని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా ఈ చిత్రంలో జయరాం హీరోగా నటిస్తున్నాడు.

సంబంధిత వార్తలు