బల్బు చోర.. కసరత్తుల వీర..

Updated By ManamThu, 06/28/2018 - 14:51
This Man Is Not Exercising For Health But For Bulb Theft
  • బల్బు దొంగతనం కోసం ఎన్నెన్ని పాట్లో 

This Man Is Not Exercising For Health But For Bulb Theft

కోయంబత్తూరు: ఓ సారి ఈ వ్యక్తిని చూడండి. ఏం చేస్తున్నాడు..? ఏం చేస్తున్నాడు.. ప్రధాని మోదీ ఫిట్‌నెస్ చాలెంజ్ తీసుకున్నాడేమో.. అందుకే వ్యాయామం చేస్తున్నాడేమో అని అంటారా.. అలా అనుకుంటే పొరపాటే. దొంగతనం చేయడం కోసం ఆ వ్యక్తి చేస్తున్న ఫీట్లివి. అరె అంతలా కసరత్తు చేస్తున్నాడంటే.. పెద్దదేదైనా దోచేయడానికే స్కెచ్ వేసి ఉంటాడే అని ఆలోచిస్తున్నారా..? అలా అనుకున్నా మీరు తప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే.. అతడు అన్ని ఫీట్లు చేస్తున్నది... ఇదిగో అక్కడ వేలాడుతున్న ఆ బల్బు కోసమే. అవును, అక్షరాల నిజమది. పాపం.. ఏం ఇబ్బంది వచ్చిందో ఏమో.. ఇలా రోడ్డు పక్కగా ఉన్న ఓ దుకాణంలో పెట్టిన కరెంట్ బల్బును దోచేయాలనుకున్నాడు ఈ చోర శిఖామణి.

రోడ్డుపై వచ్చిపోయే వాళ్లు గుర్తుపడితే దొరికిపోతానన్న భయమేమో... అలా వ్యాయామం చేస్తూ.. అటూ..ఇటూ చూస్తూ అదును రాగానే దానిని కొట్టేసి జేబులో పెట్టుకుని దర్జాగా వెళ్లిపోయాడు. కానీ, పాపం.. జనం కంట పడలేదుగానీ.. అక్కడ పెట్టిన సీసీటీవీ కెమెరా కంటికి మాత్రం చిక్కాడు ఈ బల్బు చోరుడు. అది కాస్తా ఎవరో నెట్టింట్లో పెట్టేయడంతో వైరల్ అయిపోయింది వీడియో. ఎవరూ చూడొద్దనుకుని అన్నన్ని కసరత్తులు చేస్తే.. ఇప్పుడేమో నెట్టింట్లో అందరి దృష్టిలో పడిపోయే. నెటిజన్లేమో అయ్యయ్యో పాపమంటూ.. కామెంట్లు పెట్టేసి ఈ దొంగ అంకుల్‌పై జాలి చూపిస్తున్నారాయే. ఈ ఘటన పొరుగు రాష్ట్రం తమిళనాడులోని కోయంబత్తూర్‌లోగల చెరన్ మా నగర్‌లో జరిగింది. పాలు తాగుతున్నా ఎవరూ చూడట్లేదులే అనుకునే పిల్లిలా ఆలోచించాడేమోగానీ.. సీసీటీవీ తనను చూసేస్తోందన్న విషయం మాత్రం అతడికి తెలిసుండదు పాపం. 

English Title
This Man Is Not Exercising For Health But For Bulb Theft
Related News