నిన్న మహిళ... ఇవాళ మరో వ్యక్తి

Updated By ManamThu, 11/08/2018 - 12:34
Man commits suicide by jumping from Hyderabad metro station
  • మెట్రో స్టేషన్ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

Man commits suicide by jumping from Hyderabad metro stationహైదరాబాద్ : నగరంలో వరుసగా మెట్రో స్టేషన్ల వద్ద ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. నిన్న ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఇవాళ మరో వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాగా నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా అంటూ మెట్రో పెద్ద ఎత్తున ప్రచారం చేసినా ఫలితం లేకపోతోంది. వేర్వేరు మెట్రో స్టేషన్ల వద్ద ఆత్మహత్యలకు పాల్పడటంతో వారంలో ఇది రెండో సంఘటన.

వివరాల్లోకి వెళితే...గురువారం ... అమీర్ పేట మైత్రివనం మెట్రోస్టేషన్‌ మొదటి అంతస్తు పైనుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి కిందకు దూకాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అతడు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు కుటుంబ కలహాల నేపథ్యంలో మంగళవారం ఓ మహిళ  కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్‌ మెట్రోస్టేషన్‌ పైనుంచి దూకింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటీన ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. కాగా వరుస సంఘటనలతో మెట్రో అధికారులు అప్రమత్తం అయ్యారు. భద్రతను మరింతగా పెంచారు. 
 

English Title
Man commits suicide by jumping from Hyderabad metro station
Related News