కల్వకుంట్ల వంశంలోనే అబద్ధాలు

Updated By ManamFri, 11/09/2018 - 01:21
jeevan reddy
  • కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి  

imageజగిత్యాల: కల్వకుంట్ల వంశంలోనే అబద్ధాలు ఉన్నాయని కాంగ్రెస్ నేత టి. జీవన్‌రెడ్డి విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో మహాకూటమి గెలుపు ఖాయమని ఆయన అన్నారు. జగిత్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ వంశంలో ఏ ఒక్కరిలోనూ మాట మీద నిలబడే వ్యక్తిత్వం, నిజాయితీ లేవని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జీవన్‌రెడ్డి పోటీలో ఉంటే కేటీఆర్, కవితకు ఎందుకంత భయమని అడిగారు. కేసీఆర్ కంటే కడియం శ్రీహరే బెటరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలకు సీఎం ఆశ ఉండటం తప్పా? అని ప్రశ్నించారు. సీఎం వాళ్లకు మాత్రమే సొంతమా అని ప్రశ్నించారు. మా కాంగ్రెస్‌లో ఉన్నవాళ్లంతా సీఎం పదవికి అర్హులేనని చెప్పారు. అదే కాంగ్రెస్ గొప్పదనమని కొనియాడారు. టీఆర్‌ఎస్‌లో కేసీఆర్, కేటీఆర్ మాత్రమే సీఎంలు కావాలని కలలు కంటున్నారని ఆయన దెప్పిపొడిచారు. మహాకూటమి అభ్యర్థులు ఖరారు అయిన తర్వాత ప్రచారం జోరందుకుంటుందని ఆయన అన్నారు. అభ్యర్థులు ఖరారు కాకముందే టీఆర్‌ఎస్ నాయకుల్లో గుబులు మొదలయ్యిందన్నారు.  

English Title
Lying in the family of kcr
Related News