లక్ కలిసొచ్చేనా!

Updated By ManamThu, 09/20/2018 - 01:48
puja jhaveri

imageతెలుగులో రైట్ రైట్, ద్వారకా, ఎల్7.. తమిళంలో తోడరి.. కన్నడలో శివమ్, యుగపురుష సినిమాల్లో నటించిన పూజా జవేరి టచ్‌చేసి చూడు చిత్రంలో స్పెషల్ అప్పియరెన్స్‌లో తళుక్కుమంది. తర్వాత మరో తెలుగు చిత్రంలో నటించలేదు. కాస్త గ్యాప్ తర్వాత తెలుగులో నవీన్ చంద్ర చిత్రంలో నటించనుంది. అడ్డా ఫేమ్ కార్తీక్ రెడ్డి. జి దర్శకత్వంలో సినిమాల పైరసీ నేపథ్యంలో సాగే రొమాంటిక్ థ్రిల్లర్‌లో నవీన చంద్ర హీరోగా నటిస్తున్నారు.

ఇందులో మలయాళ బ్యూటీ గాయత్రీ సురేశ్ ఓ హీరోయిన్‌గా నటిస్తుంటే.. మరో హీరోయిన్ పాత్ర కోసం పూజా జవేరిని ఎంపిక చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఈ పాత్రలో అయినా పూజా జవేరికి లక్ కలిసొస్తుందేమో చూద్దాం.

 

image 

English Title
Let's meet luck!
Related News