ఆ న్యూడ్ సీన్‌లో ఏడుసార్లు నటించా..

Updated By ManamWed, 07/11/2018 - 16:05
 Kubbra Sait
  • ‘సేక్రెడ్ గేమ్స్’ సన్నివేశంపై కుబ్రా సేత్ వివరణ

kubbra sait-sacred games

న్యూఢిల్లీ : ఓ వెబ్ సిరీస్ చిత్రీకరణలో భాగంగా ఏడుసార్లు నగ్నంగా నటించాల్సి వచ్చిందని ప్రఖ్యాత నటి, యాంకర్ కుబ్రా సేత్ వెల్లడించారు. ఈ సిరీస్‌లో కొన్ని న్యూడ్ సీన్లు కూడా ఉంటాయని తనకు ముందే చెప్పారని ఆమె తెలిపారు. ఆ విషయం ముందే తెలిసినా.. సెట్స్‌లో నటించడానికి అంగీకరించానని చెప్పారు. 

అయితే ఆ ఒక్క సన్నివేశమే పదే పదే చిత్రీకరించడంతో కొంత ఇబ్బంది పడ్డానని.. ప్రతీసారీ ఆ సీన్ పూర్తయిన తర్వాత నేలమీద పడి ఏడ్చానని సేత్ వివరించారు. ఈ వెబ్ సిరీస్‌కు అనురాగ్ కశ్యప్ కో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన సూచనల మేరకు, ఆ సన్నివేశంలో పర్‌ఫెక్షన్ వచ్చేంత వరకూ రీటేక్ చేయాల్సి వచ్చిందని సేత్ పేర్కొన్నారు. 

తనకు కావాల్సిన సన్నివేశాన్ని నటీనటులతో రాబట్టుకోవడానికి అనురాగ్ కశ్యప్ చాలా తపన పడతారని వివరించారు. ఈ సన్నివేశాన్ని చిత్రీకరించే సమయంలో ప్రతిసారీ కశ్యప్ తనవద్దకు వచ్చి మరో టేక్ తీద్దామని అనేవారని చెప్పారు. ఆ సమయంలో ఇలా పదే పదే చేయిస్తున్నందుకు నన్ను తిట్టుకోవద్దని అనేవారు.

‘నాకు తెలుసు నాపై కోపం, ద్వేషం వస్తోంది. కానీ నన్ను తిట్టుకోవద్దు’ అని కశ్యప్ చెప్పేవారని సేత్ అన్నారు. ఇలా ఆరుసార్లు జరిగాక ఏడోసారి టేక్ ఓకే అయిందని సేత్ వివరించారు. అప్పటికే అలసిపోయిన తాను సెట్‌లోంచి బయటికి వెళ్లానని.. అప్పుడు లోపలి నుంచి చిత్ర యూనిట్ సభ్యుల కరతాళ ధ్వనులు వినిపించాయని కుబ్రా సేత్ పేర్కొన్నారు. ఇంత కష్టపడి తీసిన ఆ సన్నివేశం అద్భుతంగా ఉందా.. లేక వల్గర్‌గా ఉందా చూసి మీరే చెప్పండంటూ ఆమె ఓ ప్రశ్నను సంధించారు.

English Title
Kubbra Sait Shot Nude Scene 7 Times in secred games on netflix
Related News