కోహ్లీ చెత్త సమీక్షకుడు

Updated By ManamMon, 09/10/2018 - 22:36
michale vas
  • ఇంగ్లాండ్ మాజీ సారథి మైకెల్ వాన్  

imageలండన్: భారత పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ప్రపం చంలోనే గొప్ప బ్యాట్స్‌మనే కానీ చెత్త సమీక్షకుడు కూడా అతడే అని అన్నాడు ఇంగ్లాండ్ మాజీ సారథి మైకెల్ వాన్. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న చివరి టెస్టులో కోహ్లీ రివ్యూలు కోరడమే ఇందుకు కారణం. ఐదో టెస్టు మూడో రోజు న ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ స్వల్ప విరామంలోనే రెండు రివ్యూలను వాడేశాడు. రెండింట్లో ఏ ఒక్కటి కూడా భారత్‌కు అనుకూలంగా ఫలితం రాకపో వడంతో రెండు రివ్యూలను కోల్పోయింది. 9.2 ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన బంతి ఓపెనర్ జెన్నింగ్స్ ప్యాడ్లను తాకింది.

దీంతో కోహ్లీ రివ్యూ కోరగా బంతి స్టంప్స్ అవతలవైపు నుంచి వెళ్లడంతో ఆ రివ్యూ వృథా అయ్యింది. అనంతరం 11.6 ఓవర్లో మరోసారి జడేజా వేసిన బంతి కుక్ ప్యాడ్లను తాకింది. దీంతో మరోసారి కోహ్లీ రివ్యూను ఆశ్రయించాడు. కానీ, ఇక్కడ కూడా కోహ్లీకి నిరాశ తప్పలేదు. ఈ సంద ర్భాన్ని దృష్టిలో పెట్టుకుని వాన్ తన ట్విటర్‌లో ‘విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్‌మన్. కానీ, ని జం చెప్పాలంటే ప్రపంచంలో చెత్త సమీక్ష కుడు కూడా కోహ్లీనే’ అని ట్విటర్‌లో పేర్కొన్నాడు. 

English Title
Kohli is the worst reviewer
Related News