త్వరలో ప్రపంచం పెను మార్పును చూస్తుంది

Updated By ManamWed, 06/13/2018 - 01:57
kim, donald
  • ఉత్తర కొరియా, అమెరికా సంబంధాల్లో సరికొత్త శకం

  • ట్రంప్, కిమ్ చరిత్రాత్మక భేటీ విజయవంతం.. 

  • అణు నిరాయుధీకరణపై కుదిరిన సమగ్ర ఒప్పందం

  • అణు పరీక్ష కేంద్రాలు, క్షిపణుల ధ్వంసానికి కిమ్ ఓకే.. 

  • ఆ దేశ భద్రతకు ట్రంప్ హామీ.. కవ్వింపులకు చెల్లుచీటి

సెంటోస్: అనుమానాలు పటాపంచలయ్యాయి. సంశయాలకు తెరపడింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తించిన అమెరికా kim, donaldఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ మధ్య చరిత్రాత్మక భేటీ విజయవంతమైంది. ఇరు దేశాల సంబంధాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. సింగపూర్‌లోని సెంటోస్ దీవిలో ట్రంప్, కిమ్ భేటీ సందర్భంగా ఉత్తరకొరియా అణు నిరాయుధీకరణపై సమగ్ర ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం.. సాధ్యమైనంత త్వరలో ఉత్తరకొరియా అణ్వస్త్ర పరీక్ష కేంద్రాలను, అణు క్షిపణులను నిర్వీర్యం చేయాల్సి ఉంటుంది. అలాగే.. అమెరికా కూడా ఉత్తరకొరియాకు పలు భరోసాలు ఇచ్చింది. ఉత్తరకొరియా భద్రతకు హామీ ఇచ్చింది. ఆ దేశాన్ని కవ్వించే చర్యలను మానుకుంటామని వెల్లడించింది. ఇకపై దక్షిణకొరియాతో కలిసి సైనిక విన్యాసాలు నిర్వహించబోమని స్పష్టత ఇచ్చింది. అయితే.. ఉత్తరకొరియాపై విధించిన దౌత్య, ఆర్థిక పరమైన ఆంక్షలను మరికొన్ని రోజులు కొనసాగిస్తామని అమెరికా స్పష్టం చేసింది. అణ్వస్త్ర నిర్మూలనపై ఉత్తరకొరియా తీసుకునే చర్యలకు అనుగుణంగా ఆంక్షల ఎత్తివేతపై నిర్ణయం తీసుకుంటామని అమెరికా వెల్లడించింది. మంగళవారం సెంటోస్ దీవిలోని కేపెల్లా హోటల్‌లో ట్రంప్, కిమ్ భేటీ దాదాపు 4 గంటలపాటు సాగింది. తొలుత ఏకాంతంగా చర్చలు జరిపిన అనంతరం ఇద్దరు నేతలు దౌత్య అధికారులతో కలిసి సమావేశమయ్యారు. కొరియా ద్వీపకల్పంలో అణునిరాయుధీకరణ, శాంతి స్థాపనే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా ఒక సమగ్ర ఒప్పందంపై ఇరు దేశాధినేతలు సంతకాలు చేశారు. సమావేశం ప్రారంభానికి ముందు హాలులోకి వెళ్లేముందు ట్రంప్, కిమ్ ఒకరినొకరు వెన్నుతట్టుకుంటూ వెళ్లడంగమనార్హం. భేటీ అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు.

కొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు సంసిద్ధం..: ట్రంప్
‘‘ఉభయ దేశాల సంబంధాల్లో కొత్త చరిత్ర, అధ్యాయాన్ని లిఖించేందుకు మేం సంసిద్ధంగా ఉన్నాం. ఉత్తరకొరియా అణుimage నిరాయుధీకరణపై చరిత్రాత్మకమైన సమగ్ర ఒప్పందం కుదిరింది. మేం విశాల హృదయంతో వ్యవహరించాం. శాంతిస్థాపనకు ఈ సమావేశం ఒక కీలక మైలురాయి వంటిది. చాలా సానుకూలంగా ఈ భేటీ జరిగింది. అందరూ ఊహించిన దానికంటే అద్భుతంగా ఈ సమావేశం జరిగిందని నేను అనుకుంటున్నా. ఈ సమావేశం ద్వారా చాలా పురోగతి చోటుచేసుకుంది. గత ఘర్షణలు భవిష్యత్తులో యుద్ధాలు కాకూడదు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఎన్నో అడ్డంకుల తర్వాత..దాదాపు 25 గంటలపాటు చర్చలు జరిగిన అనంతరం ఈ సింగపూర్ భేటీ సాకారమైందని అన్నారు.  ఎన్నో సంశయాలు, ఊహాజనితాలను ఈ భేటీతో అధిగమించామని పేర్కొన్నారు.  ఓ ప్రశ్నకు బదులిస్తూ.. ఈ ప్రక్రియ సాధ్యమైనంత త్వరలోనే ప్రారంభమవుతుందని భావిస్తున్నానని అన్నారు. ‘‘ఈ రోజు జరిగన  దానికి నేనెంతో గర్విస్తన్నారు. ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమైన అంశంపై ఇద్దరం నేతలం ఓ అవగాహనకు వచ్చాం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.  కిమ్ ధోరణిపై ఒకింత అనుమానాలు ఉండేవని, ఆయన ఈ శాంతిప్రక్రియను మధ్యలోనే ముగించేస్తారని అనుకున్నానని అన్నారు. కానీ.. అలా జరగలేదన్నారు. 34 ఏళ్ల కిమ్‌తో ‘ఒక ప్రత్యేక బంధం’ ఏర్పడిందన్నారు. ‘‘నేను ఊహించినదానికి కన్నా మేం చాలా ముందుకువెళ్లాం.  రెండు దేశాల మధ్య దౌత్యాధికారులను పరస్పరం బదిలీ చేసుకున్నాం. ప్యాంగ్‌యాంగ్‌లో పర్యటించాలని ఉందని పేర్కొన్నాను. వైట్‌హౌజ్‌కు రావాలని కిమ్‌ను ఆహ్వానించాను’’ అని ట్రంప్ పేర్కొన్నారు. కొరియా ద్వీపకల్పాన్ని అణునిరాయుధీకరణ చేసేందుకు కిమ్ చాలా నిబద్ధతతో వ్యవహరించారని ప్రశంసించారు. స్వదేశానికి చేరగానే ఒప్పందం అమలుకు కిమ్ ప్రయత్నాలు ప్రారంభిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ఇలాంటిది గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇది.. ప్రారంభించకుండానే ముగిసే పరిపాలనమైన పరమైన ప్రక్రియ కాదు. గతమే ఎప్పుడూ భవిష్యత్తును నిర్మించదు. ప్రపంచ చరిత్రలోని అత్యంత గొప్ప రోజుల్లో ఇదీ ఒకటి’’ అని ట్రంప్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇరువురి మధ్య మరిన్ని సంప్రదింపులు ఉంటాయని సంకేతాలు పంపారు. ‘‘గతంలో ఎప్పుడూ ఇంత వరకు వెళ్లలేదని కిమ్ నాతో చెప్పారు. ఇంతకుముందున్న అధ్యక్షులపై తనకు విశ్వాసం లేకపోయిందని అన్నారు. నా కంటే కూడా ఎక్కువగా కిమ్ ఈ పని చేయడానికి ఆసక్తిగా ఉన్నారు’’ అని అన్నారు. భవిష్యత్తులో కిమ్‌తో తాను మళ్లీమళ్లీ భేటీ అవుతానని పేర్కొన్నారు. కిమ్ చాలా తెలివైన వాడని, ఆయన తన దేశాన్ని ఎంతగానో ప్రేమిస్తారని ప్రశంసించారు. 

ప్రపంచం పెనుమార్పును చూడబోతోంది: కిమ్
తాము గతాన్ని మరిచి ముందుడుగు వేయాలని నిర్ణయించామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉంగ్ పేర్కొన్నారు. ప్రపంచం పెను మార్పు ను చూడబోతోందని అన్నారు. పూర్తి అణు నిరాయుధీకరణకు ఉత్తరకొరియా కట్టుబడి ఉందని అన్నారు.  ఈ క్షణం కోసం యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిందన్నారు. కాగా, సమావేశం అనంతరం ఉత్తరకొరియా ప్రభు త్వం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దాని ప్రకారం.. ‘‘మా దేశానికి భద్రత గ్యారెంటీ ఇస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. బదులుగా అణు నిరాయుధీకరణకు కట్టుబడి ఉంటామని మేం పేర్కొన్నాం. చర్చల సందర్భం గా యుద్ధ ఖైదీలు, సైనిక చర్య సందర్భంగా ఆచూకీ తెలియకుండాపోయిన వారి గురించి కూడా ఓ ఒప్పందం కుదరింది’’ అని వెల్లడించింది.

సమావేశం ఇలా జరిగింది
సింగపూర్‌లోని ఆర్చడ్ ఏరియాలో బస చేసిన ఇద్దరు నేతలు మంగళవారం స్థానిక కాలమానం ఉదయం 8 గంటల తర్వాత సెంటో సా దీవిలోని క్యాపెల్లా హోటల్‌కు చేరుకున్నారు. బస చేసిన హోటల్ నుంచి మీటింగ్ జరుగుతున్న హోటల్ వరకు సింగపూర్ ప్రజలు భారీగా బారులు తీరి నేతలకు స్వాగతం చెప్పారు. సంప్రదాయం ప్రకారం వయ సులో చిన్నవాడైన కిమ్ తొలుత సమావేశస్థలికి చేరుకున్నారు. అనం తరం ట్రంప్ అక్కడికి చేరుకున్నారు. ఇరు దేశాధినేతలు తమ తమ జెం డాల ఎదుట నిలబడి 13 సెకన్లపాటు కరచాలనం చేసుకున్నారు. ముం దుగా కిమ్.. ట్రంప్‌ను పలకరించారు. ‘ప్రెసిడెంట్.. మిమ్మల్ని కలవడం బాగుంది’ అని కిమ్ మొదటగా మాట్లాడారు. ‘ఇది నా గౌరవం.. మీతో అద్భుతమైన సంబంధం ఉంటుందని భావిస్తున్నా. అందులో ఎటువంటి సందేహం లేదు’ అని ట్రంప్ బదులిచ్చారు. సమావేశం గదివైపు వెళ్తుండ గా.. కిమ్ మాట్లాడుతూ.. ‘‘ఈ సమావేశాన్ని ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా చూస్తుంటుంది. చాలా మంది ఈ దృశ్యాన్ని ఓ సైన్స్ ఫిక్షన్ సిని మాలాగా చూస్తూ ఉండి ఉంటారు’’ అని పేర్కొన్నారు. కాగా, ట్రంప్, కిమ్ మధ్య ఏకాంత చర్చలో 80 ఏళ్ల చరిత్ర ఉన్న టేబుల్‌ను ఉపయో గించడం విశేషం. సింగపూర్ సుప్రీంకోర్టు జడ్జి వినియోగించిన టేబుల్‌ను ఇందుకు వినియోగించారు. సమావేశం అనంతరం ఇరువురు నేతలు కలిసి భోజనం చేశారు. అనంతరం హోటల్ పరిసరాల్లో ఇద్దరు నేతలు కలియతిరిగారు. ఈ సందర్భంగా ట్రంప్ తన కారు ‘ది బీస్ట్’ను కిమ్ జాంగ్‌కు పరిచయం చేశారు. కారులోని సదుపాయాల గురించి ట్రంప్ కిమ్‌కు వివరించారు.

ఇవి ఈ శతాబ్దపు చర్చలు: దక్షిణకొరియా
ట్రంప్, కిమ్ మధ్య చర్చలను దక్షిణ కొరియా ఆహ్వానించింది. ‘‘ఇది ఈ దశాబ్దపు చర్చలు’’గా ఆ దేశ మీడియా అభివర్ణించింది. సమా వేశం విజయవంతం కావాలని, ఈ ప్రాంతంలో పూర్తిగా అణు నిరాయుధీకరణ జరగాలని, శాంతి నెలకొనాలని, కొత్త అధ్యాయం ప్రారంభమ వ్వాలని ఆకాంక్షిస్తున్నామని ఆ దేశ అధ్యక్షుడు మూన్ జే ఇన్ పేర్కొన్నారు. ట్రంప్, కిమ్ మధ్య సమావేశాన్ని ఐక్యరాజ్యసమితి, ఐరోపా యూనియన్, రష్యాస్వాగతించాయి. ఈ చరిత్రాత్మక సమావేవం ప్రపంచశాంతికి బాటలు వేస్తుందని అభిప్రాయపడ్డాయి. ఇవి అత్యంత కీలకమైన.. అవసరమైన చర్చలు అని ఈయూ పేర్కొంది. కొరియా ద్వీపకల్పంలో శాంతి నెలకొల్పేందుకు సుదీర్ఘమైన ప్రయాణంలో తొలి అడుగుపడిందని సింగపూర్ ప్రధాని లీ ఈ లూంగ్ అభిప్రాయపడ్డారు.

ఆంక్షలు ఎత్తివేయాలి: చైనా
ఉత్తరకొరియాపై అమెరికా విధించిన ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాల్సిన అవసరం ఉందని చైనా అభిప్రాయపడింది. ఐక్యరాజ్యస మితి నిబంధనలను తాము గౌరవిస్తామని, కానీ చర్చలు విజయవం తంగా ముగిసినందున ఆ దేశంపై ఆంక్షలు ఎత్తివేయాల్సిన అవసరం ఉందని చైనా విదేశాంగశాఖ మంత్రి గెంగ్ షువాంగ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఐరాస తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

English Title
Kim Jong Un, Donalad Trump sign on MoU
Related News