బాలీవుడ్‌లోకి కీర్తి సురేశ్..!

Updated By ManamThu, 10/18/2018 - 13:15
Keerthy Suresh

Keerthy Suresh‘మహానటి’ చిత్రం తరువాత కీర్తి సురేశ్ క్రేజ్ చాలా పెరిగింది. ఆమెతో పనిచేసేందుకు టాప్ దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మహానటితో వచ్చిన స్టార్‌డమ్‌ను కొనసాగించడం కోసం ఆచితూచి అడుగులు వేస్తున్న కీర్తి సురేశ్.. పేరు తీసుకొచ్చే కథలనే ఎంచుకుంటోంది. కాగా ప్రస్తుతం మలయాళ, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న కీర్తి త్వరలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.

బుధవారం కీర్తి సురేశ్ పుట్టినరోజు కాగా.. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ మల్హోత్రా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ.. ‘‘నీతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా’’ అంటూ కామెంట్ పెట్టాడు. దానికి స్పందించిన కీర్తి ‘‘థ్యాంక్యు సర్, నేను కూడా వెయిట్ చేస్తున్నా’’ అంటూ కామెంట్ పెట్టింది. కాగా ఇటీవల రాణి ముఖర్జీ నటించిన ‘హిచ్‌కీ’ చిత్రానికి సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అలాంటి సిద్ధార్థ్, కీర్తి కోసం ఎలాంటి కథను తయారు చేశాడు..? ఏఏ భాషలలో ఈ చిత్రం తెరకెక్కనుంది అని తెలుసుకోవాలనుకుంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

 

English Title
Keerthy Suresh debut in Bollywood
Related News