కేసీఆర్‌జీ థ్యాంక్యూ

Updated By ManamFri, 08/10/2018 - 01:03
Nitish Kumar
  • ఫోన్ చేసిన బీహార్ సీఎం నితీష్‌కుమార్

nithishహైదరాబాద్: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి టీఆర్‌ఎస్ సభ్యులు మద్దతిచ్చినందుకు కేసీఆర్‌కు బీహార్ సీఎం నితీష్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఆ యన ఫోన్ చేసి మాట్లాడారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఓటేసి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధిలో తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి జేడీయూ అభ్యర్థి ఎంపిక కావడంతో కేసీఆర్ కూడా నితీష్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు. 

English Title
KCR Thank you
Related News