అగ్రిగోల్డ్ బాధితులను సర్కార్ ఆదుకోవాలి

Updated By ManamWed, 06/13/2018 - 18:46
Telangana Govt Must justice for AgriGold victims families Said Congress Leader Ponguleti

ponguleti and cm kcr

హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. "అగ్రిగోల్డ్‌కు చెందిన 2లక్షల 65వేల బాధితులకు న్యాయం జరగాలి. తెలంగాణలో డిపాజిటర్లను మోసంచేసిన అగ్రిగోల్డ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డీజీపీ, సీఐడీకి ఫిర్యాదు చేశాను. అగ్రిగోల్డ్ ఆస్తులను తక్షణమే సీజ్ చేసి తెలంగాణ సర్కార్ స్వాధీనంచేసుకోవాలి. తెలంగాణలో అగ్రిగోల్డ్‌కు చెందిన 12 వందల ఎకరాలను ప్రభుత్వం వెంటనే స్వాధీనంచేసుకోవాలి. అగ్రిగోల్డ్ యాజమాన్యంపై తెలంగాణ ప్రభుత్వం ఉదాసీనత సరికాదు. డిపాజిటర్లను మోసం చేసిన అగ్రిగోల్డ్ యాజమాన్యంపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే కేసులు పెట్టాలి.

కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు ఇప్పటికే అగ్రిగోల్డ్ పై కఠినంగా వ్యవహరించినట్లే.. తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించాలి. కార్పస్ ఫండ్ పెట్టి టీసర్కార్ డిపాజిటర్లను ఆదుకోవాలి. డిపాజిటర్లను మోసం చేసిన అగ్రిగోల్డ్ చైర్మన్, డైరెక్టర్లను తక్షణమే అరెస్ట్ చేయాలి. తెలంగాణ డిపాజిటర్లను అగ్రిగోల్డ్ మోసం చేసింది 500 కోట్లు. తెలంగాణలో ఉన్న అగ్రిగోల్డ్ఆస్తులను ఏపీసర్కార్ సీజ్ చేస్తే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదు?. అగ్రిగోల్డ్ బాధితులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. త్వరలో అగ్రిగోల్డ్  బాధితులతో పీసీసీ చీఫ్ సమావేశం ఏర్పాటుచేస్తాం. తక్షణమే సీఎం కేసీఆర్ ఈ వ్యవహారంపై దృష్టి పెట్టి డిపాజిటర్స్‌ను ఆదుకోవాలి" స్పష్టం చేశారు.

AgriGold victims

English Title
Justice for AgriGold victims families Said Congress Leader Ponguleti
Related News