జంక్‌తో సంతాన లేమి!

Updated By ManamSat, 05/05/2018 - 00:44
IMAGE

imageమీకు జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టమా.. అయితే పారాహుషార్. అతిగా ఫాస్ట్ ఫుడ్ తినేవారిని సంతానలేమి సమస్య బాధించడం ఖాయమని అడిలైడ్ యూనివర్సిటీ హెచ్చరిస్తోంది. తాజాగా 5598 మంది మహిళలపై అడిలైడ్‌లోని రాబిన్సన్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ చేసిన అధ్యయనంలో.. ఎక్కువ జంక్ ఫుడ్ తింటూ, పళ్లు తక్కువగా తినే మహిళలకుగర్భం ధరించే అవకాశాలు సన్నగిల్లుతాయని తేలింది.  
అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి..
ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, యూకే, ఐర్లాండ్ వంటి దేశాలకు చెందిన సంతానం లేని మహిళల ఆహారపు అలవాట్లపై మిడ్‌వైవ్స్ ఇంటర్వ్యూలు చేశారు. పళ్లూ, ఫలాలను తీసుకుంటూ ఫాస్ట్ ఫుడ్ అత్యల్పంగా సేవించిన వారిలో ఫర్టిలిటీ పెరిగి, అతితక్కువ సమయంలోనే గర్భం దాల్చారు.  మంచి క్వాలిటీ డైట్ అంటే రోజుకు మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు పళ్లు తిన్నవారు, నెలలో ఒకటి లేదా మూడు సార్లు మాత్రమే పళ్లు తీసుకున్నవారు చాలా ఆలస్యంగా ప్రెగ్నెంట్ అవ్వడం లేదా ప్రెగ్నెన్సీనే రాలేదని ప్రొఫెసర్ క్లెయిర్ రాబర్ట్స్ నేతృత్వంలోని స్టడీలో వెల్లడైంది.  

ఇదే ఐడియా
ఫర్టిలిటీకి, డైట్‌కు ఉన్న ప్రత్యక్ష సంబంధం తెలుసుకుంటే సంతానలేమి సమస్యనుంచి బయటపడే ఉపాయం లభించినట్టే. ఆకుకూరలు, పళ్లు, కూరగాయలు, చేపలు వంటివి ఫర్టిలిటీ పెంచేందుకు తోడ్పడతాయి. అలా కాకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నుంచి కొనుగోలుచేసే పిజ్జా, బర్గర్లు, ఫ్రైడ్ చికెన్, ఫ్రైడ్ ఆలూ చిప్స్, డోనట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, చాట్ వంటివాటితో ఫర్టిలిటీ క్షీణిస్తుందని స్టడీ తెలిపింది. మరోవైపు ఆల్కహాల్, స్మోకింగ్ అలవాట్లు, మెటర్నల్ ఏజ్, బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) వంటివన్నీ ఫర్టిలిటీపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ‘ద జర్నల్ ఆఫ్ హ్యూమన్ రీప్రొడక్షన్’లో ఈ స్టడీని పబ్లిష్ చేశారు. 

ఫాస్ట్ ఫుడ్
ఎప్పుడూ ఫాస్ట్ ఫుడ్ తినని మహిళలు లేదా ఎప్పుడో అరుదుగా ఫాస్ట్ ఫుడ్ తిన్న మహిళలతో .. తరచూ ఫాస్ట్ ఫుడ్ తినే మహిళలను పోల్చితే వచ్చిన ఫలితాలు మహిళల ఆహారపు అలవాట్లతో ఎటువంటి ప్రభావం కనిపిస్తుందో స్పష్టమైంది.  వారానికి మూడు లేదా నాలుగుసార్లు జంక్ ఫుడ్ తిన్న స్త్రీలను ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ బాధించడం తథ్యం అని తెలిసాకైనా.. సంతానం కావాలనుకునే వారు తమ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుని తీరాల్సిందే.

English Title
WITH JUNK FOOD..
Related News