అది ఏ రంగానికైనా వర్తిస్తుంది

Updated By ManamSat, 07/21/2018 - 01:50
amalapal

imageమహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి మనం తరచూ వింటూ వుంటాం. ఈమధ్యకాలంలో సినిమా రంగంలో అలాంటి వేధింపులు ఎక్కువ అయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ విషయం గురించి హీరోయిన్ అమలా పాల్ మాట్లాడుతూ ‘‘సినిమా రంగంలో రాణించాలంటే మానసిక ధైర్యం చాలా అవసరం. అలా లేని వారు ఇక్కడ ఏమీ సాధించలేరు. మహిళలపై వేధింపులు అనేవి కేవలం సినిమా రంగంలోనే ఎక్కువగా ఉన్నాయని చెప్పడం సరికాదు. అన్ని రంగాల్లోనూ ఏదో ఒక రూపంలో ఈ వేధింపులు ఉంటాయి. ఆ సమయంలో మహిళలు ధైర్యంగా ఉండాలి.  ముఖ్యంగా సినిమాల్లోకి రావాలనుకునే వారు ఇది గుర్తుపెట్టుకోవాలి. ధైర్యం లేకపోతే మీరు అనుకున్నది సాధించడం జరగదు. ఏ రంగంలో ఉన్నవారికైనా అది వర్తిస్తుంది.

image


అందుకే ఎప్పడూ ధైర్యాన్ని వీడిపోవద్దు. మన నిర్ణయం మీద నిలబడి ఉండడం, మన మనసులోని భావాలను నిస్సంకోచంగా చెప్పడం నేర్చుకోవాలి. అలా చేస్తే ఏ సమస్యనైనా ఎదిరించగలం, దానిపై పోరాటం చెయ్యగలం’’ అంటూ మహిళలకు ధైర్యాన్ని చెబుతోంది అమల.

English Title
It applies to any sector
Related News