మహిళల క్రికెట్ జట్టు కోచ్ పదవికి నేడు ఇంటర్వ్యూలు

Updated By ManamFri, 08/10/2018 - 00:18
ramesh-powar
  • బరిలో సునీల్ జోషి, రమేష్ పవార్‌జూ న్యూజిలాండ్ బ్యాట్స్‌మమన్ కూడా

ramesh-powarన్యూఢిల్లీ: టీమిండియా మహిళల క్రికెట్ జట్టు కోచ్ పదవికి నేడు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. కోచ్ పదవికి సుమారు 20 మందిని ఇంటర్వ్యూ చేయనున్నారు. వీరి లో భారత మాజీ స్పిన్నర్స్ సునీల్ జోషి, రమేష్ పవార్ బరిలో ఉన్నా రు. మిగిలిన వారిలో భారత మా జీ వికెట్ కీపర్ అజయ్ రత్రా, విజయ్ యాదవ్, భారత మహిళ జట్టు మాజీ కెప్టెన్ మమతా మబీన్, సుమన్ శర్మ కూడా ఉన్నారు. వీరితో పాటు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్న పూర్ణిమ రూయ్ కూడా లిస్ట్‌లో ఉన్నా రు. 2 టెస్టులు, 51 వన్డేలు ఆడిన న్యూజిలాండ్ క్రీడాకారిణి మారియా ఫాహే సైతం కోచ్ పదవికి దర ఖాస్తు చే సుకుంది. భారత్ తరపున రెండు టెస్టులు, 31 వన్డేలు ఆడిన రమేష్ పవార్ భారత మహిళ జట్టుకి తాత్కలిక కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. జోషి కూడా అనుభవం కలిగిన ఆటగాడు, కోచ్. ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్ భారత్ తరపున 15 టెస్టులు, 69 వన్డేలు ఆడాడు. జమ్ముకశ్మీర్, అస్సాం, హైదరాబాద్ జట్లకు 160 ఫస్ట్ క్లాస్ మ్యా చ్‌లకు జోషి కోచ్‌గా వ్యవహరించాడు.

English Title
Interviews with women's cricket team coach today
Related News