అమ్మకాల్లో సాధరణ వృద్ధి

Updated By ManamFri, 11/09/2018 - 22:33
car
  • ప్యాసింజ్ వాహనాల్లో అత్యల్పం

  • 24% వృద్ధితో జోరు మీద వాణిజ్య వాహనాలు

  • ఓకే అనిపించిన మోటర్ సైకిళ్ల విభాగం

carన్యూఢిల్లీ: గత నెలలో ప్యాసింజర్ దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో వృద్ధి స్వల్పంగా ఉన్నట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) వెల్లడించింది. మొత్తం 2,84,224 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు 2018 అక్టోబర్‌లో అమ్ముడైనట్లు సియామ్ తెలిపింది.అయితే 2017 అక్టోబర్‌లో ఈ సంఖ్య 2,79,877 యూనిట్లుగా ఉంది. కాగా, గత ఏడాది అక్టోబర్‌తో పోల్చుకుంటే గడచిన అక్టోబర్‌లో నమోదైన ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 1.55 శాతం ఎక్కువ. ఇక కార్ల విశయంలో కూడా 2017 అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో స్వల్పంగా (0.39) పెరిగి 1,84,706 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. మోటార్ సైకిళ్ల విభాగంలో మాత్రం అమ్మకాలు 20 శాతం వృద్ధిని సాధించినట్లు సియామ్ పేర్కొంది. గడచిన అక్టోబర్ వాటి అమ్మాలకు 13,27,758 యూనిట్లు విక్రయాలు సాధించింది. అంతకు ముందు 2017 అక్టోబర్‌లో 11,05, 140 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా 17.23 శాతం పెరిగినట్లు సియామ్ తెలిపింది. గత నెలలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు గత ఏడాది అక్టోబర్‌తో పోల్చుకుంకటే 17,51,608 నుంచి 20,53,497కు పెరిగాయి. అక్జోబర్ నెలలో వాణిజ్య వాహనాల అమ్మకాలు అత్యధికంగా 24.82 శాతం పెరిగి 87,147 యూనిట్లు అమ్ముడయ్యాయి. వీటి విక్రయాల సంఖ్య 2017 అక్టోబర్‌లో 69,816 యూనిట్లుగా ఉంది. వాహనాల అమ్మకాల్లో క్యాటగిరీల వారీగా 15.33 శాతం వృద్ధిని నమోదైనట్లు సియామ్ పేర్కొంది.

Tags
English Title
Instant growth in sales
Related News