పాండ్యకు గాయం.. చాహర్‌కు చోటు!

Updated By ManamThu, 09/20/2018 - 14:55
Hardik Pandya, Asia Cup 2018, Deepak Chahar, BCCI, Pakistan team, Team India

Hardik Pandya, Asia Cup 2018, Deepak Chahar, BCCI, Pakistan team, Team Indiaదుబాయి: భారత్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తీవ్రగాయం కారణంగా ఆసియా కప్‌ నుంచి నిష్ర్కమించాడు. పాకిస్థాన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 24ఏళ్ల పాండ్య గాయంతో మైదానంలో కుప్పకూలాడు. గాయం తీవ్రంగా బాధించడంతో పాండ్య తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు. దాంతో హార్దిక్ ఆసియా కప్ కొనసాగడంపై కష్టంగానే కనిపిస్తోంది. ఈ క్రమంలో పాండ్య స్థానంలో దీపక్ చాహర్‌ను తీసుకోనున్నట్టు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌లో హార్దిక్ బౌలింగ్ వేస్తుండగా గాయపడ్డాడు.

ఈ మ్యాచ్‌లో ఐదోసారి బౌలింగ్ వేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తీవ్రగాయమైన వెంటనే పాండ్యను స్ట్రెచర్‌పై తీసుకెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం బీసీసీఐ పాండ్యకు తీవ్రగాయమైనట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. పాండ్య స్థానంలో రానున్న దీపక్ చాహర్ గత జూలైలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రాకు గాయం కావడంతో అతని స్థానంలో చాహర్‌కు చోటు దక్కింది. 

English Title
Injured Hardik Pandya ruled out of Asia Cup 2018, Deepak Chahar named replacement
Related News