సెకన్లలో తప్పిన పెను ప్రమాదం..

Updated By ManamThu, 07/12/2018 - 13:10
IndiGo, Bengaluru airspace, collision,passengers
  • ఎదురెదురుగా రెండు ఇండిగో విమానాలు

  • తృటిలో తప్పిన పెను ప్రమాదం

  • 330మంది ప్రయాణికులు సురక్షితం

IndiGo

ముంబై : రెండు ఇండిగో విమానాలకు తృటిలో ప్రమాదం తప్పింది. పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో సుమారు 330మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు ఎయిర్‌స్పేస్‌లో  ఈ నెల 10న (మంగళవారం) ఇండిగో సంస్థకు చెందిన రెండు విమానాలు గాలిలో పరస్పరం ఢీకొట్టుకోబోయాయి. కోయంబత్తూరు నుంచి హైదరాబాద్  వెళ్లే 6ఈ 779 విమానం, బెంగళూరు నుంచి కొచ్చిన్ వెళ్లే 6ఈ 6505 విమానాలు ఎదురెదురుగా వచ్చాయి. 

రెండు విమానాల మధ్య కేవలం 200 ఫీట్లు ఎత్తు మాత్రమే ఉండగా, పెను ప్రమాదాన్ని కొన్ని సెకన్ల ముందే అవి తప్పించుకున్నట్లు విమానాశ్రయ అధికారులు ధ్రువీకరించారు.  కాగా ఆ విమానాలు రెండింటిలోనూ  టీసీఏఎస్ అలారమ్స్ మోగినట్లు తెలిపారు. కాగా కోయంబత్తూరు నుంచి హైదరాబాద్ విమానంలో 162మంది ప్రయాణికులు ఉండగా, బెంగళూరు-కొచ్చిన్ విమానంలో 166మంది ప్యాసింజర్స్ ఉన్నారు. 

Tags
English Title
IndiGo planes came face-to-face in Bengaluru airspace
Related News