పుట్టా.. క్రైస్తవుడా.. యాదవా అనేది తేలిపోయింది!

Updated By ManamSun, 04/15/2018 - 13:54
TTD chief after rumours on social media

I'm 100 percent Hindu, says newly-appointed TTD chief after rumours on social media

అమరావతి: టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ వ్యవహారం పెద్ద దుమారమే రేగుతోంది. పుట్టాను చైర్మన్‌‌గా నియమించిన మరుసటి క్షణం నుంచే వివాదస్పదమవుతోంది. చంద్రబాబు కేబినెట్‌‌లో మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు సిపారసుతో చైర్మన్ గిరి వచ్చినప్పటికీ వివాదాలు మాత్రం పుట్టాను వెంటాడుతూనే ఉన్నాయి. ఓ వైపు శివస్వామి, మరోవైపు వీహెచ్‌‌పీ సంచలన ఆరోపణలు చేస్తుండటంతో అసలు వివాదమేంటి? ఎందుకిది వెలుగులోకి వచ్చిందనే విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

ఈ ఆరోపణలు ఎందుకొచ్చాయంటే..!
టీటీడీ చైర్మన్ పదవి రాక మునుపు నుంచే పుట్టా.. యాదవులను కాదనుకొని క్రిస్టియన్లకు ప్రాముఖ్యతనిచ్చి వారి సాయం చేస్తూ వారితో కలిసిమెలిసి ఉండే వ్యక్తని ప్రధాన ఆరోపణలపై ఆయన ఇలా స్పందించారు. " అదంతా పక్కా అబద్ధం. గురుస్వామి వెనుకల ఉన్న శక్తులు కొన్ని కావాలనే రెచ్చగొట్టి ఆయన్ను ముందుకు నడిపిస్తున్నాయి. ఎడ్లపందెం జరుగుతుంటే నేను ఒక అతిథిగా మాత్రమే వెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేనేదే క్రిస్టియన్‌లోకి చేరానని ఆరోపించడం దారుణాతి దారుణం. బీసీలు, యాదవులు ఎదుగుతుంటే చూసి ఓర్చుకోలేక కొన్ని శక్తులు శివస్వామి నడిపిస్తున్నాయి. ఆయన చేసే ఆరోపణాలన్నీ వందకు వంద శాతం తప్పే. నేను వంద శాతం హిందువునేఅని పుట్టా స్పష్టం చేశారు. 

పక్కా ఆధారాలున్నాయ్..!!
"
నేను రాజకీయాల్లోకి రాక 9 సంవత్సరాల మునుపే ఒక కృష్ణుడి దేవాలయం కట్టించడం జరిగింది. నేను సొంతంగా రూ. కోటి నిధులు ఖర్చు చేసి గుడి కట్టించాను. అలాగే ప్రతీ ఏడాదీ నా సొంత నిధులు రూ. 10 లక్షలు ఖర్చు పెట్టి క్రిష్ణాష్టమి, ఉగాది రోజు రెండ్రోజులు పండుగ చేసుకుంటాం. మా కులదైవం శ్రీకృష్ణుడు, మా ఇంటిదేవుడు వెంకన్న స్వామి. మేం ఇప్పటికీ మా కుటుంబం కుమారులు మొదలుకుని మనువళ్లు వరకూ తిరమల వెంకన్న దగ్గరికెళ్లి తలనీలాలు సమర్పించుకుంటాం" అని పుట్టా పేర్కొన్నారు.

శివస్వామికి సవాల్..!
"
ఈ వ్యవహారంలో క్రిస్టియన్స్ అనేది పాయింట్ కాదని.. గురుస్వామిని వెనుక నుంచి బీజేపీ, వైసీపీ నడిపిస్తున్నాయి తప్ప మరొకటి లేదు. శివస్వామి చెబుతున్న మాటల్లో ఒక్క శాతం కూడా నిజం లేదు. ఆయన నిరూపిస్తానంటే నేను దేనికైనా సిద్ధమే అంటూ పుట్టా సవాల్ విసిరారు. బీసీలు ఎదుగుతుంటే ఓర్చుకోలకే ఇవన్నీ తతంగాలు నడుపుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. టీటీడీలో సభ్యుడిగా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చాలా గుళ్లు కట్టించానని..  ఇంత చేసిన తనపై క్రిస్టియన్ ముద్ర వేయడం సబబుకాదు" అని ఆయన అన్నారు.

ఆరోజు మీరంతా ఎక్కడికెళ్లారు..?
ఇంతకముందు నాస్తికుడైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ అయినప్పుడు ఈ గురుస్వాములంతా ఎక్కడికెళ్లారు?. ఆ రోజు అడగకుండా కళ్లు మూసుకోనున్నారా?. అప్పట్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏడుకొండలను రెండు కొండలు చేస్తూ  జీవో ఇచ్చారు. అప్పుడంతా ఈ సంఘాలు, స్వాములు  ఏమయ్యారు. వాళ్లు అగ్రకులం వారని ప్రశ్నించలేదా?.. యాదవులకు రాకరాక ఓసారి అవకాశం వచ్చిందని దీన్ని చెడగొట్టాలనే ఉద్దేశంతోనే ఇదంతా రాజకీయ నాయకులు చేస్తున్న కుట్రే తప్ప మరోటి లేదు" అని ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. 

మా కోరిక ఒక్కటే..!!
"
తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత పెంచాలి. సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించాలి.. ఆ ఆశయంతోనో మేం ముందుకు వెళ్తున్నాం తప్ప వేరే ఆశలేదు. కచ్చితంగా పవిత్రత కాపాడుతాం. సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తాం" అని పుట్టా సుధాకర్ స్పష్టం చేశారు.

Controversy TTD Chairman Putta Sudhakar Yadav Appointment

English Title
I'm 100 percent Hindu, says newly-appointed TTD chief after rumours on social media, Sivaswamy
Related News