లైంగిక వేధింపులుంటే... ఫిర్యాదు చేయండి

Updated By ManamThu, 07/19/2018 - 01:13
image
  • మహిళలకు పారిస్ పోలీసుల విజ్ఞప్తి  

imageపారిస్: వరల్డ్ కప్ గెలుపు సంబరాల్లో భాగంగా ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడివుంటే ఫిర్యాదు చేయాల్సిందిగా పారిస్ మహిళలను స్థానిక పోలీసులు బుధవారం కోరారు. చాలా మంది పాల్పడినట్టు ఇటీవల సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ అవుతున్నాయి. ‘ఇటువంటి సంఘటనలను మా దృష్టికి తెస్తే విచారణ జరిపి నిజాలు తేలుస్తాం. ఆ వ్యక్తిని మేము గుర్తించ గలిగితే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం’ పోలీస్ చీఫ్ మైఖెల్ డెల్పెచ్ అన్నారు.

ఆదివారం రాత్రి క్రొయేషియాతో జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్ గెలిచిన తర్వాత కొంత మంది యువకులు మహిళలను బలవంతంగా ముద్దు పెట్టుకోవడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి సంఘటనలు జరిగినట్టు పోలీసులకు నివేదిక అందింది. అంతేకాకుండా సోమవారం విజేత జట్టుతో జరిగిన పెరేడ్ ర్యాలీలో కొంత మంది లైంగికంగా వేధించినట్టు కూడా తెలుస్తోంది. ‘నాక్కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. బహుశా మూడో గోల్ సమయంలో అనుకుంటా నా స్కర్ట్‌ను ఎవరో తాకినట్టు అనిపించింది’ అని ఇశా అనే మహిళ పోస్ట్ చేసింది. అయితే ఇతర బాధితులు మాత్రం పోలీసుల మాటలు నమ్మడం లేదు. తాము కేసులు పెట్టినా పోలీసులు విచారణ జరుపుతారన్న నమ్మకం లేదని.. ఆ వ్యక్తులు వేగంగా జనాల్లో కలిసిపోయారని ఆ బాధితులు అంటున్నారు. 

English Title
If you have sexual harassment ... complain
Related News