అదే దర్శకుడైతే.. జీ(ఎస్)టీ2కి రెడీ..!

Updated By ManamWed, 02/07/2018 - 20:54
GT 2, not GST, Rashmi Gatuam, Twitter followers

GT 2, not GST, Rashmi Gatuam, Twitter followersహైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘జీఎస్టీ’ (గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌)కు విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. జీటీ (గుంటూరు టాకీస్) సినిమాకు సీక్వెల్‌గా జీటీ2 చిత్రాన్ని తీస్తే అందులో తాను నటిస్తానంటోంది ప్రముఖ యాంకర్, నటి రష్మి. అయితే ఈ చిత్రానికి ‘గరుడవేగ’ సినిమా దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు దర్శకుడైతే తాను నటించేందుకు రెడీ అంటోంది. ట్విటర్‌ ఫాలోవర్స్‌తో బుధవారం రష్మి సంభాషించారు.

ఈ సందర్భంగా ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుండగా.. ఓ వ్యక్తి ‘జీఎస్టీ 2’లో మీరు నటించేందుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. అందుకు రష్మి ‘జీటీ2లో నటిస్తా.. కానీ ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించాలి’ అంటూ బదులిచ్చారు. అదేవిధంగా యాంకర్ అనుసూయకు సంబంధించి కూడా ప్రశ్నించగా.. ‘క్షమించండి.. నేను ఆమె సలహాదారుని కాదు’ అన్నారు. చివరిగా మరో ట్వీట్‌తో రష్మి బాంబు పేల్చారు. ‘నేను నటిస్తా అన్నది ‘జీటీ2’ చిత్రంలో.. జీఎస్టీ.. కాదు’ అని ట్వీట్ చేశారు. రష్మి ట్వీట్‌పై స్పందించిన మరో నెటిజన్.. ‘ నాకు తెలిసి మీకూ.. జీటీ2  సరికాదు.. జీఎస్టీ2 సరిగ్గా సరిపోతుంది’ అని ట్వీట్ చేశాడు. 

English Title
I said GT 2 and not GST,says Rashmi Gatuam in a tweet
Related News