రూటర్ వైఫై పాస్‌వర్డ్ మార్చుకోండిలా?

Updated By ManamSat, 07/07/2018 - 15:29
 Wi-Fi password,  router Wi-Fi password, smartphones, smart TVs

 Wi-Fi password,  router Wi-Fi password, smartphones, smart TVsబ్రాండ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకున్నవారూ తమ డేటా దుర్వినియోగం కాకుండా ఉండాలంటే పాస్‌వర్డ్‌ను అమర్చుకోవడం తప్పనిసరి. చాలామందికి రూటర్ వైఫై వినియోగంపై అవగాహన ఉండదు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీల్లో కూడా ఇంటర్‌నెట్ వైఫై వినియోగం సర్వసాధారణంగా మారింది. దీంతో ఒక డివైజ్ నుంచి మరో డివైజ్ సులభంగా డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం వీలుపడుతోంది. చాలామంది తమ రూటర్ వైఫై పాస్‌వర్డ్‌ను పదేపదే గుర్తుపెట్టుకోవడం కష్టమని స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలు తరహా ఇతర డివైజ్‌లలో వైఫై పాస్‌వర్డ్‌ను సేవ్ చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు వైఫై పాస్‌వర్డ్‌ను సేవ్ చేయడం అది సెక్యూరిటీ పరంగా చిక్కులను తెచ్చిపెట్టే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇతరుల డివైజ్‌పై వైఫై పాస్‌వర్డ్‌ను సేవ్ చేసినట్టయితే వారు డేటాను అతిగా వాడేసే అవకాశం ఉంది. డేటాను భద్రపరుచుకోవాలంటే ఒక్కటే పరిష్కారం.. మీ రూటర్ వైఫై పాస్‌వర్డ్‌ను తరచూ మార్చుకుంటూ ఉండండి చాలు.. ఒకవేళ రూటర్ వైఫై పాస్‌వర్డ్ మార్చుకోవడం ఎలానో తెలియదా? అయితే ఈ కింది విధంగా ఓసారి ప్రయత్నించి చూడండి.. 

ఇవి తప్పక తెలుసుకోవాలి.. 
- మీరు వాడే రూటర్ ఏ బ్రాండ్ ముందుగా తెలుసుకోవాలి. ఆ బ్రాండ్ పేరు, దాని మోడల్ నెంబర్ గుర్తించాలి
- రూటర్ క్వానిఫిగరేషన్ పోర్టల్‌పై ఓ యూఆర్ఎల్ లింక్ ఉంటుంది.. (యూజర్ మ్యానువల్‌ను చెక్ చేయండి)
- రూటర్ వైఫైకి సంబంధించి డిఫాల్ట్ లాగిన్ ఐడీతో పాటు పాస్‌వర్డ్ ఉంటాయి. (డిఫాల్ట్ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్) ‘అడ్మిన్’.. అని ఉంటుంది. 
- మీ ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్ గానీ ఒకే వైఫై కనెక్షన్‌ ఇవ్వవచ్చు. లేదా, ల్యాన్ కేబుల్ ద్వారా రూటర్‌కు కనెక్షన్ ఇచ్చి తద్వారా ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేయొచ్చు. 

వైఫై పాస్‌వర్డ్‌ మార్చే విధానం..
- స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్‌లో ఏదైనా బ్రౌజర్‌ను ఓపెన్ చేయండి
- కాన్ఫిగిరేషన్ పోర్టల్‌లో (టీపీ-లింక్ రూటర్ 192.168.1.1)ను మీ బ్రౌజర్ అడ్రస్ బార్‌లో టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
- రూటర్ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
- వైర్‌లెస్ సెక్యూరిటీ ఆప్షన్ ఎక్కడ ఉందో పరిశీలించి దానిపై క్లిక్ చేయండి.
- పీఎస్‌కే పాస్‌పేర్స్‌లోకి వెళ్లి అక్కడ ఎనిమిది క్యారెక్టర్ల మీ (స్ట్రాంగ్) పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.
- సేవ్ బటన్‌పై క్లిక్ చేసి రూటర్‌ను రీబూట్ చేయండి..
- హాట్‌స్పాట్ పాస్‌వర్డ్‌ను సెక్యూర్ పాస్‌వర్డ్‌గా మార్చుకోవాలి. 
పాస్‌వర్డ్‌లో ఎప్పుడూ (ఆల్ఫాన్యూమరిక్) ఆంగ్ల పెద్ద అక్షరాలతో నెంబర్లను జత చేయాలి. 
- సులభంగా ఎవరైనా గుర్తించేలా ముద్దుపేర్లు, పుట్టినరోజు తేదీలు, ఇంటి నెంబర్లు, బైక్, కార్ల నెంబర్లు, ఫోన్ నెంబర్లను పాస్‌వర్డ్‌లుగా వాడరాదు.  
- స్పెషల్ క్యారెక్టర్లను వైఫై పాస్‌వర్డ్‌లో గుర్తుండే విధంగా ఆల్ఫాన్యూమరిక్‌తో పాటు ఉపయోగించాలి. 
How to change the Wi-Fi password of your routerఅంతే.. చాలు.. మీ రూటర్ వైఫై పాస్‌వర్డ్ మారిపోయింది.. ఇకపై మార్చిన కొత్త వైఫై పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వైఫై పాస్‌వర్డ్‌ను ఎవరైనా గుర్తించేలా సాధారణంగా ఉండకుండా జాగ్రత్త పడండి..

English Title
How to change the Wi-Fi password of your router
Related News