నల్ల మచ్చలకు ఇంటి చిట్కాలు

Updated By ManamSun, 10/28/2018 - 16:09
black spots
black spots
  • ఒక టీస్పూన్ తేనే, నాలుగు-ఐదు చుక్కల నిమ్మరసం, కుంకుమ పూవు తంతువులు అన్నీ కలిపి నల్ల మచ్చలు ఉన్న ప్రదేశం లో పూయడం వలన త్వరగా నల్ల మచ్చలు పోతాయి.. 

  • రెండు టీస్పూన్ల టొమాటో రసం, నాలుగు టీస్పూన్ల మజ్జిగ ను కలిపి నల్లని మచ్చలు పైన పూయడం వలన నల్లమచ్చలు తగ్గు ముఖం పడుతాయి.

  • గంధం పొడి మరియు గులాబీ నీరు ని పేస్ట్ లాగా చేసి పూయడం వలన నల్లని మచ్చలు పోతాయి. అలాగే జిడ్డు

  • చర్మం ఉన్నవారికి మొటిమలు కూడా తగ్గుముఖం పడుతాయి.

  • కలబంద గుజ్జు పూయడం వలన  నల్ల మచ్చలు పోతాయి.. 

  • ఎండిన నారింజ తొక్కు పొడి, నిమ్మ తొక్కు పొడి, గులాబీ నీళ్లు అన్నిటిని కలిపి ఆ మిశ్రమాన్ని పూయడం వలన నల్లని మచ్చలు తగ్గుతాయి.

  • కీరదోస రసం, పెరుగు కలిపినా మిశ్రమాన్ని పూయడం వలన నల్లని మచ్చలు పోతాయి.. 

  • విటమిన్ 'ఇ' నూనే  ను రాత్రి పూట ముఖానికి పూయడం వలన నల్లని మచ్చలు పోతాయి.. 

  • ఆలివ్ నూనే తో చర్మాని మసాజ్ చేయడం వలన కూడా ఫలితం ఉంటుంది.

English Title
home remedies to dark spots
Related News