హిందూస్థాన్ కాపర్ లాభంలో మూడు రెట్ల వృద్ధి

Updated By ManamThu, 08/09/2018 - 23:22
hindustan

hindustanన్యూఢిల్లీ: ప్రభుత్వ నిర్వహణలోని హిందూస్థాన్ కాపర్ 2018 జూన్ 30తో ముగిసిన మూడు నెలల కాలానికి మూడు రెట్ల పెరుగుదలను కనబరుస్తూ ఒంటరిగా రూ. 35.26 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం అదే కాలంలో కంపెనీ ఒంటరిగా రూ. 10.21 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ ఒంటరిగా సాధించిన ఆదాయం రూ. 427.04 కోట్లుగా ఉంది. గత  ఆర్థిక సంవత్సరం అదే కాలంలో నమోదు చేసిన రూ. 426.84 కోట్ల ఆదాయంతో పోలిస్తే అది కొద్దిగా ఎక్కువ. కంపెనీ మొత్తం వ్యయాలు మాత్రం గత ఆర్థిక సంవత్సర క్యూ 1లో ఉన్న రూ. 410.61 కోట్ల నుంచి ఈ ఏప్రిల్-జూన్ కాలంలో రూ. 376.07 కోట్లకు తగ్గాయి. ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించుకునేందుకు రానున్న ఆరేళ్ళ కాలంలో రూ. 5,500 కోట్లను వెచ్చించనున్నట్లు హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్ ఇటీవల వెల్లడించింది. గనుల తవ్వకం, రాగి ఖనిజాన్ని శుద్ధి చేసి, పరిశుద్ధమైన రాగి లోహాన్ని ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని కంపెనీ ప్రధానంగా కొనసాగిస్తోంది. 

Tags
English Title
Hindustan Copper has a threefold growth in profit
Related News