నిర్మాణంలోని ఆసుపత్రిలో భారీ మంటలు

nagpur
  • ఏడుగురికి గాయాలు

నాగపూర్: నిర్మాణంలోని ఆసుపత్రి భవనంలో చెలరేగిన మంటల్లో ఏడుగురు గాయపడ్డారు. మంటల్లో భవన నిర్మాణ కూలీలు 20 మంది చిక్కుకు పోయారు. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 10 అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగినా మంటలు త్వరగా అదుపులోకి రాలేదు. షార్ట్ సర్క్యూట్ కార ణంగానే మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు. బుధవారం ఉన్నట్టుండి ఉదయం 10 గంటల సమయంలో నల్లని దట్టమైన పొగలు ఇక్కడి నిర్మాణంలో ఉన్న 10 అంతస్థుల భవనంలో అలముకున్నాయని ప్రత్యక్ష సాక్షి వివరించాడు. సైనికులు కూడా మంటలార్పేందుకు అగ్నిమాపక బృందాలకు సహకరించడంతో మధ్యహ్నం 3 గంటల తరువాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. నిజానికి ఈ భవన నిర్మాణంలో 400 మంది కూలీలు పనిచేస్తుండగా, భోజనం కోసం వీరంతా కింది అంతస్తులో ఉండడంతో అతిపెద్ద ప్రమాదం తప్పినట్టు నాగపూర్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారి వెల్లడించారు. మూడవ అంతస్థులోని ఆడిటోరియంలో ఇంటీరియర్ పనులు జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగగా ఆ ప్రాంతమంతా అలముకున్న దట్టమైన పొగలతో కాసేపు ఏమీ కనిపించకుండా పోయింది. వెల్డింగ్ పనుల్లో ఎగిరే నిప్పు కణికలతో ప్రమాదం జరిగి ఉండచ్చని మరికొందరు భావిస్తున్నారు.  గత నెల 27, 29న ముంబై నగరంలో జరిగిన రెండు పెద్ద అగ్నిప్రమాదాల్లో ఏడుగురు మరణించగా, మరో ప్రమాదంలో 12 మంది అగ్నమాపక సిబ్బంది గాయపడ్డారు. 

Tags

సంబంధిత వార్తలు