నేటి నుంచి ‘హ్యాపీ నెస్ట్’

Updated By ManamFri, 11/09/2018 - 01:40
happy nest
  • ఆన్‌లైన్‌లో ముందుగా 300 ఫ్లాట్ల విక్రయం

  • జనవరి ఒకటిన తొలి టవర్ ఫ్లాట్ల ప్రారంభోత్సవం

  • సీఆర్‌డీఏ సమావేశంలో సీఎం చంద్రబాబు

happy nestఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ‘హ్యాపీ నెస్ట్’ ఫ్లాట్ల  విక్రయం శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. ముందుగా 300 ఫ్లాట్లను విక్రయానికి పెట్టనున్న సీఆర్‌డీఏ మరో 300 ఫ్లాట్లను అదనం(బఫర్)గా ఉంచుకోవాలని, ఇందుకు తాము అనుమతిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.  గురువారం ఉండవల్లి ప్రజావేదికలో సీఆర్‌డీఏ 21వ సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించారు. రాజధానిలో వివిధ విభాగాల్లో నిర్మాణమవుతున్న గృహాలను, రహదారులు తదితర మౌలిక సదుపా యాలను ప్రధానంగా సమీక్షించారు. ఈ ఆరు వందల ఫ్లాట్లు బుకింగ్ పూర్తయితే మరో 600 యూనిట్లను బుకింగ్ కోసం ఆన్ లైన్ లో ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ‘హ్యాపీనెస్ట్’ ఫ్లాట్ల కొనుగోలుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన రాగలదని భావిస్తున్నట్లు, గత వారం తమకు 17 వేల ఫోన్ కాల్స్ రావటమే ఇందుకు తార్కాణమని సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి వివరించారు. ‘హ్యాపీనెస్ట్’ ఫ్లాట్లలో సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వలని ముఖ్యమంత్రి కోరారు. మొదట వచ్చిన వారికే మొదటి కేటాయింపు ప్రాతిపదికన పూర్తి పారదర్శకత పాటించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అవసరమైతే ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్ అధికారులకు హ్యాపీనెస్ట్ తరహా గృహాలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.  భూమి ధరను చూసి నైష్పత్తిక ప్రాతిపదికన ధర నిర్ణయించాలని సీఎం కోరారు. 

Tags
English Title
'Happy nest' from today
Related News