వీడియో: ఎమ్మెల్యేగారు.. విషసర్పంతో ఆటలా!  

Updated By ManamThu, 07/12/2018 - 16:51
Gujarat Congress MLA, Paresh Dhanani, poisonous snake

Gujarat Congress MLA, Paresh Dhanani, poisonous snakeఅహ్మదాబాద్: రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడమే కాదు.. అప్పుడప్పుడూ సాహసకృత్యాలు కూడా చేస్తుంటారు రాజకీయ నాయకులు. ప్రత్యర్థులతోనే కాదు.. విషపూరిత పామును కూడా ఆడేసుకున్నారు గుజరాత్‌లోని అమ్రేలి కాంగ్రెస్ ఎమ్మెల్యే పరేశ్ ధనాని.  అది విషపూరితమైన పామును తెలిసి కూడా ఆయన అత్యంత ధైర్యసాహసాన్ని ప్రదర్శించి వార్తల్లో నిలిచారు. ప్రాణంతకమైన ఓ విషసర్పం తోకను పట్టుకొని ఆయన ఎలా ఆడిస్తున్నారో చూడిండి.. గాంధీనగర్‌లోని తన ఇంటికి దారితప్పి వచ్చిన అతి ప్రమాదకరమైన రక్తపింజరి పామును ఆడిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 35 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పరేశ్.. ఎలాంటి భయం లేకుండా పామును ఒక చేత్తో అదుపు చేస్తూ రోడ్డుపై ఆడుకుంటూ ఇలా కనిపించారు. ఎమ్మెల్యే పరేశ్ ఇంటి వద్ద ఉన్న ఆయన సిబ్బంది వీడియో తీసి బుధవారం సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.

‘‘ఇదొక రక్తపింజరి విషస్వరం. దారితప్పిన ఈ పాము పొరపాటున నా ఇంటి ఆవరణంలోకి వచ్చింది. కానీ, నాకు పాములను ఎలా పట్టుకోవాలో బాగా తెలుసు’’ అని ఆ వీడియోకు కాప్షన్ పెట్టారు. అనంతరం ఆ పామును పక్కనే పొదల్లోకి వదిలిపెట్టారు. ప్రాణాంతకమైన రక్తపించరి పామును చూసి అక్కడ ఉన్నవారంతా భయాందోళనకు గురైతే.. ఎమ్మెల్యే పరేశ్ మాత్రం ఎలాంటి భయం లేకుండా ఆడుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోవడం వంతైంది. మరో విషయం ఏమిటంటే.. ఆసియాలోనే అతి ప్రమాదకరమైన విషసర్పాల్లో రక్తపింజరి పాము ఒకటి. ఈ పాము కాటేస్తే.. ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే.. ఈ పాము కాటు వల్ల ఏడాదికి వేలసంఖ్యలో చనిపోతున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ఇదే..

English Title
Gujarat Congress MLA Paresh Dhanani catches poisonous snake outside residence, video goes viral
Related News