నెర్రెలు బాసిన నేలకు బతుకు చెలిమలు

Updated By ManamSat, 07/21/2018 - 02:11
ts

తెలంగాణ గడ్డది గొప్ప త్యాగాల చరిత్ర. ఎదురైన ప్రతి ఓటమి నుంచి నూతన ఉత్తేజంతో విజయం వైపునకు పయనిం చింది. నీళ్లు లేక నేలలు నెర్రెలు వాస్తున్నా బతుకు చెలిమెల కోసం పోరుచేసింది. కన్నీటి గాథల నుంచి నీళ్ల వైపుగా తెలంగాణ పయనించింది. ఇది ఒక అత్మగౌరవ అస్తిత్వ పతాక, పోరాటానికి పుట్టినిల్లు, కోటి రతనాల వీణ ఎన్నో పోరాటాల అనంతరం తెలంగాణ సాధ్యమైంది. తెలంగాణ సాధన అనంతరం ఎన్నో విజయాలను  సాధించుకుంది. తనను తాను నిలుపుకుంది, ఆత్మగౌరవంతో తల ఎత్తుకుంది, స్వయంపాలనతో సంతోషంగా నిలిచింది. ప్రభుత్వ ఏర్పాటు కాగానే దాన్ని కూల్చే కుట్రలు కూడా జరిగినాయి. కానీ దాన్ని కేసీఆర్ సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఇలా మననీటిపై జరుగుతున్న కుట్రలను సైతం వారు చాక చక్యంగా వ్యవహరించి అడ్డంకులను తొలంగించారు.
 

image

అరవై ఏండ్లుగా తెలంగాణ ఎంతో వెనకబాటుకు గురైంది, ఎన్నో అవమానాలను పడింది, ఎన్నో అణచివేతలకు గురైంది. అవన్నీ దూరంచేస్తూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఏర్పాటు కల సాకారమైంది. తెలంగాణ ఏర్పాటై నాలుగేళ్లు పూర్తయింది. తెలంగాణ ఈ నాలుగేండ్లలో ఎన్నో విజయాలను సాధించింది. ఎన్నో కుట్రలను చేదించింది. కేసీఆర్ నాయక త్వంలో బంగారు తెలంగాణ దిశగా వడివడిగా అడుగులేస్తుంది.

ఈ నాలుగేండ్లలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దేశంలోనే సంక్షేమంలో నెంబర్ ఒన్‌గా నిలి చింది. చెరువులకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చి ఎండాకాలంలో సైతం చెరువుల్లో నీల్లు ఉండేవిధంగా చెరువులను తీర్చిదిద్దింది. మిషన్ కాకతీయతో గ్రౌండ్ వాటర్ పెరిగి రైతులు రెండో పంట వేసుకునే దిశగా అడుగులు పడ్డాయి. సమైక్య రాష్ట్రంలో మనం ఎదుర్కొన్న ప్రధాన సమస్య కరెంట్, కరెంట్ లేక పంటలు ఎండి రైతుల ఆత్మ హత్యలు జరిగినాయి, కానీ స్వరాష్ట్రం సిద్ధించాక స్వయంపాలనలో కేవలం ఏడాదిలోనే కరెంట్ కష్టా లను తీర్చింది తెలంగాణ సర్కార్. మన దగ్గర బొగ్గు, నీరు ఇలా విద్యుదుత్పత్తికి కావాల్సిన వనరులు ఉన్నా గత పాలకుల పాలనలో అవి తరలించబడినాయి. దోపిడీకి గురై పంటలెండి నాయి, కానీ స్వరాష్ట్రంలో దాన్ని మనం అధిగమించగలిగాం.

తెలంగాణ ఏర్పాటుకు ముందు తెలంగాణ ఏర్పడితే కరెం ట్ రాదు అని, నీరు రాదు అని, ఇలా ఎన్నో అపోహలు, అభూ త కల్పనలు సృష్టించారు కొందరు నాయకులు కానీ వాళ్ల అంచనాలు తప్పాయునడానికి నేటి ఫలితాలను కేసీఆర్ చూపిస్తున్నారు. ప్రజల సమస్యలు, రైతుల కష్టాలు, తెలంగా ణపై పూర్తి పట్టున్న నాయకుడు కేసీఆర్. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆయన నిర్ణయం తీసుకుంటారు. ప్రభు త్వం ఏర్పడిన నాటి నుంచి నేటివరకు ప్రజలకు ఉపయోగపడే కళ్యాణలక్ష్మి, ఆసరా పింఛన్ ఇలా చాలా పథకాలతో వారి మనసు గెలుచుకున్నాడు. రోజురోజుకు ఆయునైపె ప్రేమ ప్రజ ల్లో రెట్టింపవుతుంది ఆయనను తమ సొంతమనిషిగా ప్రజలు భావిస్తున్నారు.

తెలంగాణ ఆషామాషీగా ఏర్పడలేదు. ఎన్నో పోరాటాలు, త్యాగాల అనంతరం ఏర్పడింది. ఆ ఏర్పాటు కూడా అంత మామూలుగా ఇయ్యలేదు ఎన్నో కొర్రీలు పెట్టి ఇచ్చిన్రు. ఆ కొర్రీలను అన్నీంటిని అధిగమిస్తూ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రభుత్వ ఏర్పాటు కాగానే దాన్ని కూల్చే కుట్రలు కూడా జరిగి నాయి. కానీ దాన్ని కేసీఆర్ సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఇలా మన నీటిపై జరుగుతున్న కుట్రలను సైతం వారు చాక చక్యంగా వ్యవహరించి అడ్డంకులను తొలంగించారు.

ప్రాజెక్టులతో రైతుల బ్రతుకుల్లో ఆశలు నిండుతున్నాయి. ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధపెట్టింది. మంత్రి హరీ శ్‌రావు  18 గంటలు ప్రాజెక్ట్ కోసం గొప్పగా పనిచేస్తున్నారు. నిరంతరం ప్రాజెక్ట్‌లను పరిశీలిస్తూ పనుల వేగవంతానికి పాటు పడుతున్నారు. ఇరిగేషన్ రంగానికి హరీశ్‌రావు లాంటి మంత్రి దొరకడం నిజంగా అదృష్టమే. నిబద్ధతతో ప్రజల కల నెరవే ర్చాలనే సంకల్పంతో తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి మొత్తం సమయాన్ని ప్రాజెక్ట్‌ల నిర్మాణం కోసం కేటాయి స్తున్నారు మంత్రి హరీశ్. ఎన్నో సమీక్షలు నిర్వహిస్తూ వాటి స్థితిగతులపై ఆరాతీస్తూ అవి త్వరితగతిన పూర్తయ్యే దిశగా చర్యలు  కేసీఆర్ తీసుకుంటున్నారు. ఖమ్మానికి నీళ్లొస్తాయని ఎవరూ ఊహించలేదు. భక్త రామదాసు ప్రాజెక్టును ఏడాదిలోనే నిర్మించి చరిత్ర సృష్టించారు. పల్లేర్లు మొలిచిన పాలమూరులో పచ్చని పంటల్ని పండించి ప్రభుత్వం చూపిం చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఇరిగేషన్ అద్భుతంగా నిలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో చరిత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్, నీళ్ళ మంత్రి హరీశ్, ఇంజనీర్లు నిలవనున్నారు.  ఈ ప్రాజెక్టులతో కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ త్వరలో రూపు దిద్దుకోనుంది.

మిషన్ భగీరథ పనులు ఊపందు కున్నాయి. దాదాపు డిసెంబర్ కల్లా పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యమ కారులకు రకరకాల స్థానాల్లో పద వులు ఇస్తూ గౌరవించుకుంటున్నం. మన కళలను కాపాడుకుంటున్నం, మన సంస్కృతిని నిలబెటు ్టకుం టున్నాం. కులవృత్తులకు ముఖ్య మంత్రి ఊతం ఇస్తున్నారు అన్ని రకాల కులవృత్తులను ప్రోత్సహిస్తూ ఆ వృత్తులను కాపాడుతున్నారు. చెరువుల్లో చేపల పెంపకం, గొర్రెల పంపిణీ, ముఖ్యంగా చేనేత వృత్తికి జీవంపోసే దిశగా అడుగులు పడి నాయి. చేనేతను ప్రోత్స హిస్తూ ప్రజల్లో ఆ బట్టలపై అవగాహన కల్పిస్తూ అవి కొనేవిధంగా ప్రోత్సహిస్తూ వారికి బాస టగా ప్రభుత్వం నిలిచింది. ఐటీ రంగంలో ఎన్నో విదే శీ కంపెనీలను తెలంగాణకు రప్పిం చుకోగలిగాం. ఐటీ మంత్రి కేటీఆర్‌పై దేశదేశాలే ప్రశంసల వర్షం కురిపించాయి.

తెలంగాణ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. తమకూ కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని వారు భావిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఎన్నో అంచనాలు ఉంటాయి. డబులు బెడ్ రూం ఇండ్ల నిర్మాణం గ్రామీణ ప్రాం తాల్లో కాస్త వెనక బడింది. కాస్త వేగాన్ని అందుకుంటే అదీ త్వరలో పూర్తవుతుంది. ఎన్నో సుదీర్ఘ లక్ష్యాలు కొన్ని పూర్తయ్యాయి, కొన్ని పూర్తవుతున్నాయి, కొన్ని మొదల వుతున్నాయి. అంతి మంగా కొంత సమయం ఆగితే అన్నీ పరిష్కారం అవుతాయి. కొంత ఓపిక అవసరం. ఎన్నో ఏండ్లుగా గత పాలకులు వేసిన చెత్తను తొలగించడానికే చాలా సమయం పట్టింది. ఇప్పుడు ఫలాలు అందుతున్నాయి. మరిన్ని ఫలాలను పొందే  సమయం వచ్చింది. సంయమనం తో ఉంటే ఆ ఫలాలు మన బిడ్డలకు ఉపయోగపడతాయి. రేపటి తెలంగాణ బంగారు భవిష్యత్ కోసం మనం సైతం ముందుండి చేయిచేయి కలిపి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తెలంగాణకు అండగా నిలబడాలి.

తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర శూన్యం. పూర్తిగా ప్రతి పక్షం దుష్మన్ పాత్ర పోషిస్తోంది ప్రజల బాగోగులు మరిచి వారి సొంత ఎజెండాలను ప్రజలపై రుద్దుతున్నారు. తెలం గాణలో ప్రజలే  కేంద్రంగా పాలన నడుస్తోంది. ప్రజలే ప్రతిపక్షపాత్ర పోషించాలి. నీరు లేక నెర్రెలు వాసి నేలను బతుకు చెలిమలను వెతుక్కుయింటూ తెలంగాణ నిల బడుతుంది. త్యాగాల చరిత్ర కలిగిన ఈ గడ్డకు ప్రజల సహకారంతో మరిన్ని విజయాలు అధిరోహించాలి. తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలుస్తోంది.

 - టి. విజయ్
9491998702

English Title
great telangana
Related News