‘గ్యాంగ్ లీడర్’ రామ్‌చరణ్?

Updated By ManamWed, 06/13/2018 - 23:50
ramcharan

imageహీరో చిరంజీవి నటించిన సినిమాల్లో ఘనవిజయం సాధించినవి ఎన్నో ఉన్నప్పటికీ ‘గ్యాంగ్‌లీడర్’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. చిరంజీవికి మాస్ హీరో ఇమేజ్‌ని మరింత పెంచిన సినిమా ఇది. కమర్షియల్‌గా మంచి విజయం సాధించిన ఈ సినిమాని రామ్‌చరణ్‌తో రీమేక్ చెయ్యనున్నారన్న వార్త గత కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తోంది. రామ్‌చరణ్‌ను గ్యాంగ్‌లీడర్‌గా చూడాలనుకుంటున్నామని సోషల్ మీడియాలో చిరంజీవి అభిమానులు పలుమార్లు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ‘తేజ్ ఐలవ్‌యు’ ఆడియో ఫంక్షన్‌లో చిరంజీవి మాట్లాడుతూ క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్‌లో రామ్‌చరణ్ సినిమా ఉంటుందని చూచాయగా చెప్పారు. దీంతో అది ‘గ్యాంగ్ లీడర్’ రీమేకేనన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి ఈ చిత్రాన్ని నిర్మించే ఆలోచనలో కె.ఎస్.రామారావు ఉన్నట్టు తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందే మల్టీస్టారర్ తర్వాత చరణ్ ‘గ్యాంగ్ లీడర్’ రీమేక్ చేసే అవకాశం ఉందని సమాచారం. 

English Title
'Gang Leader' Ramcharan?
Related News