నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్

Updated By ManamSun, 05/27/2018 - 01:52
image
  • ఫేవరెట్లు నాదల్,హలెప్

 

image

పారిస్ : క్లే కోర్టు కింగ్  రఫెల్ నాదల్ ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టోర్నీ పురుషుల విభాగంలో   ఫేవరిట్‌గా బరిలోదిగుతున్నాడు. 11వ సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకునేందుకు సిద్ధవువుతున్న టాప్ సీడ్ నాదల్ తొలి రౌండ్‌లో ఉక్రెయిన్‌కు చెందిన అలెగ్జాండర్ డోల్గోపొలొవ్‌తో తొలి మ్యాచ్ ఆడతాడు. రికార్డు స్థాయిలో 11వ సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌పై గురిపెట్టిన నాదల్‌కు ఈ టోర్నీలో సులువైన డ్రా ఎదురైంది. ప్రపంచ నంబర్ -2 ఫెదరర్, బ్రిటన్ వీరుడు అండీ  ముర్రే ఈ టోర్నీ నుంచి తప్పుకోవంతో నాదల్ టైటిల్  గెలుచుకోవటం సులువయ్యే అవకాశాలున్నాయి. ఫైనల్ చేరే  క్రమంలో గాస్కెట్, అండర్సన్, సిలిచ్‌లతో నాదల్ తలపడతాడు. మరో ఫేవ రెట్ ఆటగాడు, మాజీ చాంపియన్, సెర్బియా స్టార్  జొకోవిచ్ నుంచి పోటీ ఎదురయ్యే అవకాశం  లేకపోవడంతో నాదల్ సులువుగా సెమీస్‌దాకా  చేరవచ్చు. ఇక  మహిళల విభాగంలో టాప్ సీడ్ హలెప్ (హంగెరి)కి తొలి రౌండ్ నుంచే గట్టిపోటీ ఎదుర వనుంది.  అవెురికా క్రీడాకారిణి  అలిసన్‌తో హలెప్ ఆడుతుంది. ఇక మహిళల విభాగంలో ఫేవరిట్లు షరపోవా, సెరెనా విలియమ్స్‌లు పరస్పరం తలపడే అవకాశాలున్నాయి. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తొలి గ్రాండ్‌శ్లామ్ ఆడుతున్న సెరెనా తొలి రౌండ్‌లో క్రిస్టినాయ ప్లిస్కోవా (చెక్‌రిపబ్లిక్)తో పోటీపడుతుంది.

English Title
French Open from today
Related News