రేపు కాంగ్రెస్‌లో చేరనున్న కిరణ్ రెడ్డి!!

Updated By ManamThu, 07/12/2018 - 13:33
Former CM Kiran Reddy Tomorrow Join In Congress

Former CM Kiran Reddy Tomorrow Join In Congress

ఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం ఉదయం 11:30 గంటలకు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీతో కిరణ్ రెడ్డి భేటీ కానున్నారు. శుక్రవారం భేటీ తర్వాత కిరణ్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి జాతీయ స్థాయిలో ఆయనకు ఏ బాధ్యతలు అప్పగిస్తారన్నది కాంగ్రెస్ పెద్దలు మీడియాకు వివరించే అవకాశాలున్నాయి. అంతేకాదు కిరణ్ కుమార్ రెడ్డి వెంట పలువురు కీలక నేతలు కూడా ఢిల్లీకి వెళ్లనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇటీవల.. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలు ఇంచార్జ్, మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ.. కిరణ్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలతో భేటీ అయ్యి అందరూ తిరిగి పార్టీలోకి వచ్చి బలోపేతం చేయాలని కోరిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రెండ్రోజుల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి.. కోస్తా ఆంధ్రలోని పలువురు కాంగ్రెస్ కీలకనేతలతో ఫోన్‌లో మంతనాలు జరిపారు. తాను తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నానని మీరు కూడా పార్టీలో చేరి పాత రోజులు తీసుకొచ్చేందుకు సర్వత్రా కృషి చేయాలని చెప్పారు. అయితే మాజీ సీఎం మాట మీద కాంగ్రెస్ పార్టీలోకి ఎంతమంది తిరిగొస్తారో తెలియాలంటే మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే.

Former CM Kiran Reddy Tomorrow Join In Congress

కాగా..  కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిశోర్ రెడ్డి ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయనకు హౌసింగ్ బోర్డు చైర్మన్‌ పదవిచ్చిన టీడీపీ కిరణ్‌ను కూడా పార్టీలోకి ఆహ్వానించాలని శతవిధాలు ప్రయత్నాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తానికి చూస్తే రానున్న ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్‌లు పొత్తులు ఖాయమన్న విషయం తెలుస్తోంది. అందుకే అన్న కాంగ్రెస్‌లో.. తమ్ముడు టీడీపీలో చేరారని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

English Title
Former CM Kiran Reddy Tomorrow Join In Congress
Related News