‘కాల్ గర్ల్స్’గా హీరోయిన్ల ఫొటోలు..! 

Updated By ManamThu, 06/14/2018 - 20:57
Heroines tagged as call girls, former principal, call girls, classified network 

Heroines tagged as call girls, former principal, call girls, classified network హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ల ఫోటోలను ‘కాల్‌గార్ల్స్‌’గా పేర్కొంటూ ఓ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమవ్వడం టాలీవుడ్‌లో కలకలం రేపింది. ఓ ఇంటర్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ హీరోయిన్ల ఫొటోలను కాల్ గార్ల్స్ అంటూ రేటు కార్డులతో సహా క్లాసిఫైడ్ నెట్‌వర్క్‌లో పోస్టులు పెట్టాడు. ఎస్కార్టు సర్వీసు పేరిట సదరు హీరోయిన్ల పేరుతో రేటు కార్డు అందిస్తూ రూ. 40 వేలు నుంచి రూ. 60 వేలు వరకు యువకుల నుంచి డబ్బులు గుంజాడు. ఈ వ్యవహారంపై ఓ పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒకరు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాజీ ప్రిన్సిపాల్ బాగోతం బయటకు పడింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారించగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

రూ.40వేల నుంచి రూ.60 వేలు రేట్ కార్డులు.. 
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నగరానికి చెందిన గణేష్ సైన్సులో పోస్టుగ్రాడ్యుయేషన్ చేశాడు. అనంతరం పలు ప్రముఖ ఇంటర్ కళాశాలల్లో లెక్చరరుగా పనిచేసి ఇటీవల దిల్‌సుఖ్ నగర్ లోని ఓ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. కొన్ని నెలల కిందట ఆ ఉద్యోగాన్ని కూడా వదిలేశాడు. ఈజీ మనీ ఎలా సంపాదించాలని ఆలోచించిన గణేష్.. ఎస్టార్టు సర్వీసు పేరిట అందమైన హీరోయిన్ల ఫొటోలతో ఆకర్షించేందుకు క్లాసిఫైడ్ నెట్‌వర్క్ వెబ్‌సైట్‌‌ ద్వారా యువకులకు గాలం వేశాడు. అంతేకాదు, హీరోయిన్ల పేరిట రూ.40వేల నుంచి రూ.60 వేలంటూ రేట్ కార్డులు పెట్టాడు. యువకులు ఎస్కార్టు సర్వీసు కోసం డబ్బు ఖాతాకు బదిలీ చేయగానే మొబైల్ ఫోన్ స్విచాఫ్ చేసేవాడు.

పాపులర్ ఆర్టిస్ట్ ఫిర్యాదు.. ప్రిన్సిపల్ బాగోతం బట్టబయలు.. 
ఓ పాపులర్ సినీ క్యారెక్టర్ ఆర్టిస్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగి నిందితుడు గణేష్‌ను అరెస్ట్ చేసి ఐటీ యాక్టు కింద కేసు నమోదు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తాను వ్యాపారంలో నష్టపోవడంతో ఎస్కార్టు సర్వీసు పేరిట మోసానికి పాల్పడినట్టు గణేష్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. పోలీసులు అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. గణేష్ ఖాతాలో ఎస్కార్టు సర్వీసు పేరిట రూ.8 లక్షల మేర లావాదేవీలు జరిగాయని పోలీసులు గుర్తించారు. అయితే గణేష్ ఖాతాలో మిగిలిన సొమ్ము రూ. 1.8 లక్షలు తన జీతం డబ్బులుగా పోలీసులకు చెప్పాడు. కాగా ఎస్కార్టు సర్వీసు కాల్ గాళ్స్ పేరిట టాలీవుడ్ సినీతారలు, ప్రముఖ హీరోయిన్ల ఫోటోలు ఉండటంతో దీనిపై టాలీవుడ్ లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. కాల్ గర్ల్స్ పేరిట ఆ వెబ్‌సైట్‌లో తమ ఫొటోలు కనిపించడంతో టాలీవుడ్ హీరోయిన్లు చాలామంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి చర్యకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

English Title
Flesh con: Heroines tagged as call girls
Related News