ఆదిమకాండలో యోగసూత్రాలు

Updated By ManamTue, 06/19/2018 - 07:06
image

imageబైబిల్ గ్రంథంలోని సృష్టిప్రకరణం చాలా ప్రతీకలతో నిండి ఉందంటారు స్వామి యుక్తేశ్వర్ గిరి. ఒక యోగి ఆత్మకథలో యుక్తేశ్వర్ గిరి వివరణలను ఆయన శిష్యుడైన స్వామి యోగానంద ఇలా వివరించారు.

సృష్టి ప్రకరణంలో చెప్పిన జీవన వృక్షం మానవదేహమే. వెనుబాము, తలకిందులుగా చెట్టు లాంటిది. మనిషి తల వెంట్రుకలు దానికి వేళ్లు. అంతర్వాహక, బహిర్వాహక నాడులు ఆ చెట్టు కొమ్మలు. డీమండలమనే వృక్షానికి మనం అనుభవొంచి ఆనందించదగిన ఫలాలు చాలానే కాస్తాయి. శబ్ద స్పర్శరూప రసగంధాల నే ఇంద్రియ జ్ఞానాలే ఆ ఫలాలు. మనిషి వీటిని హక్కు భక్తం చేసుకోవచ్చు. కాని అతని కి తోటమధ్యలో అంటే దేహం మధ్యలో ఉన్న ఆపిల్ పండు, అంటే లైంగికానుభవం నిషిద్ధం.

అందుకే ‘‘మనం తోటలో ఉన్న చెట్ల పళ్లను తినవచ్చు; కాని తోట మధ్యలో ఉన్న చెట్టు పండు మాత్రం తినకూడదని, మీలో ఏ ఒక్కరూ కూడా దాన్ని ముట్టుకోకూడదని లేకపోతే చనిపోతారని దేవుడు చెప్పాడు. 
అందులో చెప్పిన సర్పం లైంగిక నాడుల్ని ఉద్రేకపరిచే వెనుబాములోని శక్తిని సూచిస్తుంది. ఆదాము వివేకానికి, అవ్వ అనుభూతికి సంకేతం. ఏ మనిషిలోనయినా భావోద్రాకాన్ని కామవాంఛ లోబరుచుకున్నట్లయితే అతని వివేకం అంటే ఆదాము నశించక తప్పదు.  ఆదాములో అంటే పురుషుడిలో వివేకం ప్రాధాన్యం వహించింది. అవ్వలో అంటే స్త్రీలో అనుభూతి ప్రాధాన్యం వహించింది. 

మానవ శరీరం కేవలం జంతువుల నుంచి పరిణామ ఫలితంగా ఏర్పడ్డది కాదు. దేవుడి విశిష్ట సృష్టి ద్వారా ఉత్పన్నమయింది. జంతురూపాలు సంపూర్ణ దివ్యత్వాన్ని వ్యక్తం చెయ్యలేనంత స్థూలమైనవి. మానవుడికి మెదడులో సర్వజ్ఞతా శక్తిసంపన్నమైన ‘సహస్రార కమలం’, వెన్నులో సున్నితంగా జాగృతమైన షట్చక్రాలు విశిష్టంగా ప్రసాదించడం జరిగింది.

అవ్వకు సర్పం ఇవ్వజూపిన మంచి - చెడ్డల జ్ఞానం మాయలో ఇరుక్కున్న మనుషులు అనుభవించి తీరవలసిన ద్వంద్వ భావాత్మకమైన లేదా పరస్పర విరుద్ధమైన అనుభవాల్ని సూచిస్తుంది. అనుభూతి వివేకాల్ని దుర్వినియోగం చేసినందువల్లనే మానవుడు భ్రాంతిలో పడి, దివ్య స్వయంసమృద్ధి అనే స్వర్గవాటికలో ప్రవేశించే హక్కు కోల్పొయాడు. ద్వంద్వ ప్రకృతిని ఏకీకృతం చేసి ఈడెన్ వాటికకు చేరుకోవడమే మానవుడి ముందువున్న దివ్యలక్ష్యం.

English Title
Festivals in the primordial
Related News