రాహుల్ బ్యాటింగ్‌కు ఫిదా

Updated By ManamWed, 05/09/2018 - 21:48
image

imageముంబై:  టీమిండియా యంగ్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ ఈ  ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రెచ్చిపోతున్నాడు. అద్భుత మైన ప్రదర్శనతో కింగ్స్ పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రాహుల్‌పై ప్రశంసలు జల్లు కురుస్తోంది.  తాజాగా పాకిస్థాన్ యాం కర్ ఒకరు రాహుల్ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యా రు.  రాజస్థాన్ రాయల్స్‌తో  జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాహుల్ 54 బంతుల్లో 7 బౌండరీలు, 3 సిక్స్‌లు బాది  84 పరుగులు సాధించాడు. ఈ విజయంపై పాక్ యాంకర్ జైనబ్ అబ్బాస్ తన ట్వీటర్‌లో ఓ పోస్టు చేశారు. ‘కేఎల్ రాహుల్ టైమింగ్ అదిరింది. అత్యుత్తమ ప్రదర్శ నతో ఆకట్టు కుంటున్నాడు. అతని ఆట చూడటం గొప్పగా ఉంది’ అంటూ ఓ ట్వీట్ చేశారు. స్పోర్ట్స్ యాం కర్ అయిన జైనబ్‌కు పాక్ యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ ఐపీ ఎల్ సీజన్‌లో రాహుల్ వరుసగా అర్థ సెంచరీలతో రాణిస్తున్నాడు. 10 మ్యాచ్‌లలో 4 అర్థసెంచరీలతో 471 పరుగులు సాధించి టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇదే సీజన్‌లో 14 బంతుల్లో అర్థ సెంచరీ చేసి ఐపీఎల్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట నిలుపు కున్నాడు. మంగళవారం రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నూ రాహుల్ (70 బంతుల్లో 95 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్‌ల)తో పోరాడాడు. 

English Title
fan for rahul bating..
Related News