ఫేక్ పెడితే.. పట్టేస్తాం!

Updated By ManamSun, 05/06/2018 - 23:41
image

imageహైదరాబాద్: ఉద్యోగం కోసం అప్పటికి ఎలాంటి అనుభవం లేకపోయినా, ఫేక్ పెట్టుకుని వెళ్లిపో వాలనుకునేవాళ్లు చాలామందే ఉంటారు. ఉన్నదీ లేనిదీ ఏదో ఒక కంపెనీ పేరు పెట్టేసి అందులో రెండేళ్లు, మూ డేళ్లు పనిచేసినట్లు చూపిస్తే జీతం కాస్త ఎక్కువ వస్తుం దన్నది వాళ్ల ఆశ. అనుభవం ఉన్నవాళ్లయితే కొత్తగా పని నేర్పించక్కర్లేదని కంపెనీలు భావిస్తాయి. కానీ ఇలా ఫేక్ అనుభవాలు పెట్టుకుని వచ్చేవాళ్లతో పెద్ద తలనొప్పిగా మారింది. దాంతో ఇలాంటివాళ్లను కనిపెట్టడానికి కార్పొ రేట్ కంపెనీలు సరికొత్త విధానాలు మొదలుపె డుతున్నాయి. రిక్రూట్‌మెంట్ సమయంలో అభ్యర్థులకు పాలిగ్రాఫ్ టెస్టులు కూడా చేస్తున్నాయి. అలాగే, అప్పటికే ఉద్యోగంలో ఉన్నవాళ్లు ఎవరైనా డేటా చౌర్యానికి పాల్పడి నట్లు అనుమానం వస్తే, దాన్ని ఖరారు చేసుకోడానికి లై డిటెక్టర్ పరీక్షలు సైతం చేస్తున్నారు. ఇందుకోసం వాళ్లం తా ఎక్కువగా ఆశ్రయిస్తున్న కంపెనీ.. హైదరాబాద్‌లోని ట్రూత్ ల్యాబ్స్. దీనికి ప్రతియేటా కనీసం 20 నుంచి 30 కేసులు ఇలాంటివే వస్తున్నాయి. అయితే, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి అనుమతితో మాత్రమే ఈ తరహా పరీక్షలు చేస్తారు. పాలిగ్రాఫ్ టెస్టులు కేవలం పరిశోధనకు మాత్రమే ఉపయోగిస్తాయని, వాటికి సాక్ష్యంగా కూడా విలువ ఉంటుందని ట్రూత్‌ల్యాబ్స్ డైరెక్టర్ జీవీహెచ్‌వీ ప్రసాద్ తెలిపారు. నగరంలో పలు కంపెనీలు తమ ఉ ద్యోగులను పంపుతుంటే, మరికొన్ని కంపెనీలు నియా మక సమయంలో అభ్యర్థుల నేపథ్యాన్ని చెక్ చేసేందుకు పంపుతున్నాయన్నారు.

యూరోపియన్ దేశాలలో నియా మక విధానంలో పాలిగ్రాఫ్ టెస్టు చాలా ముఖ్యంగా మారిందని ఆయన వివరించారు. తమ వద్ద లై డిటెక్టర్ పరికరాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిపుణులు కూడా ఉన్నారని, అభ్యర్థులను మూడు రకాల ప్రశ్నలు అడుగుతూ.. చెమట పట్టడం, గుండె కొట్టుకునే రేటు, నాడి వేగం, బీపీ లాంటి వాటిని చూస్తామని తెలిపారు. ఈ ప్రశ్నలు నియంత్రిత, సంబంధిత, సంబంధం లేనివిగా ఉంటా యని, వాటికి అవును లేదా కాదు అని మాత్రమే సమా దానాలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. సమాధానాలు చెప్పేటపుడు గ్రాఫ్ నమోదవుతుందని అన్నారు.

భార్యాభర్తలు కూడా..?
ప్రస్తుతానికి ఉద్యోగుల విషయానికి మాత్రమే ట్రూత్‌ల్యాబ్స్ పరిమితం అయింది తప్ప భార్యాభర్తల జోలికి వెళ్లడం లేదు. కోర్టు ఉత్తర్వులు ఉంటే తప్ప వివాహేతర సంబంధాల లాంటి అంశాలను తాము పరీక్షించడం లేదని ప్రసాద్ చెప్పారు. కేసును బట్టి పాలిగ్రాఫ్ టెస్టుకు రూ. 5000 నుంచి రూ. 10000 వరకు ఖర్చవుతుంది. నగరంలోనే ఉన్న జేకే కన్సల్టెన్సీ అనే మరో కంపెనీ కూడా ఈ తరహా సేవలు అందిస్తోంది. సివిల్ కేసులలో తాము నిర్దోషులమని నిరూపించుకోవాలనుకునేవాళ్లు కూడా తమ సాయం కోరుతారని ప్రసాద్ తెలిపారు. ఇప్పటివరకు డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ చేయించాలంటే నగరంలోని సీసీఎంబీకి పంపేవారు. ఇప్పుడు ఢిల్లీలోని ఒక ప్రైవేటు ల్యాబ్‌తో తాము ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. పితృత్వ పరీక్షలు కూడా చేస్తాము గానీ, అందుకు భార్యాభర్తలిద్దరి అనుమతి తప్పనిసరిగా ఉండాలని ఆయన వివరించారు. 

Tags
English Title
Fake!
Related News