‘ఎఫ్ 2’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్

f2

వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా కనిపించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో గురువారం నుంచి ప్రమోషన్లను ప్రారంభించనున్నామని ముందే ప్రకటించిన చిత్ర యూనిట్.. తాజాగా టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ నెల 12న ఈ చిత్ర టీజర్‌ రానున్నట్లు ఎఫ్ 2 టీమ్ తెలిపింది. ఇక ఫన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు