వెలువడుతున్న ఎగ్జిట్ ఫలితాలు

 Madhya Pradesh exit poll results

హైదరాబాద్ : అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక ఫలితాల వెలువడటమే తరువాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ హడావుడి మొదలైంది. ఓ సర్వే ఫలితాలు బీజేపీ, మరో సర్వే కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తున్నాయి. మిజోరాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 11న ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మరోవైపు రాజస్థాన్‌లో 72.7 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇక చత్తీస్ గఢ్ లో బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నట్లు సర్వే ఫలితాలు చెబుతున్నాయి.

కాగా మధ్యప్రదేశ్‌లో అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. మొత్తం 230 స్థానాలు ఉండగా...మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇండియా టుడే, టైమ్స్ నౌ ఎగ్జిట్ ఫలితాలు ఈ కింద్ర విధంగా ఉన్నాయి.  

ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్
కాంగ్రెస్‌కు 104-122 సీట్లు
బీజేపీకి 102-120 సీట్లు

టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్
బీజేపీ 126
కాంగ్రెస్ 89 స్థానాలు
బీఎస్పీ 6 స్థానాలు

సంబంధిత వార్తలు