అంతా రెడీ అన్నీ రెడీ

Polling
  • పొద్దున 7 గంటల నుంచే ఓటింగ్

  • సొంత రాష్ట్రంలో తొలిసారిగా ఓ(వే)టేయనున్న ఓటరు

  • ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం

  • రాష్ట్రమంతా భారీ బందోబస్తు ఏర్పాటు

  • పోల్ మేనేజ్‌మెంట్‌లో నేతలు

  • ఆఖరి ప్రయత్నాల్లో అభ్యర్థులు

  • ఓటరు ప్రసన్నానికి ప్రలోభాల పంపిణీ!

  • సరికొత్త దారుల్లో ధన,వుద్యాల సరఫరా

  • భారీగా పట్టుబడుతున్న నోట్ల కట్టలు

హైదరాబాద్: ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ బందోబస్తు మధ్య పోలింగ్ నిర్వహించబోతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పహారా ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల సిబ్బంది ఇప్పటికే తమకు  కేటాయించిన ప్రాంతాలకు చేరుకుంది. మరో పక్క.. ఎన్నికల ప్రచారం బుధవారంతో ముగిసింది. నాయకులంతా పోలింగ్‌కు ముందు వ్యవహారాలను చక్కదిద్దుకుంటున్నారు. రాజకీయ పక్షాలు వ్యూహాత్మక కార్యాచరణ అమలు జరుపుతున్నాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గురువారం రోజంతా పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి కేంద్రీకరించారు. క్షేత్ర స్ధాయిలో పరిస్ధితులపై అత్యధికులైన అభ్యర్ధులతో మాట్లాడారు, బూత్ స్ధాయిలో అమలు జరపాల్సిన కార్యాచరణపై సల హాలు, సూచనలు చేశారు. ప్రత్యర్ధులు బలంగా ఉన్న నియోజక వర్గా ల్లో అనుసరిం చవలసిన వ్యూహం గురించి వివరించారు. పోలింగ్ పూర్తయ్యేంత వరకు అప్ర మత్తంగా ఉండాలని సూచించారు. మొదటి రెండు గంటల్లోనే అత్యధికులు ఓట్లు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని అభ్యర్ధులకు తెలియ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డితో పాటు పార్టీ సీని యర్లు  పోలింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. బూత్ స్ధాయిలో అనుసరించవల సిన వ్యూహంపై చర్చించడంతో పాటు పార్టీ ఆదేశాలను క్షేత్ర స్ధాయికి చేరవేసేందుకు చర్యలు తీసుకున్నారు. అధికార పక్ష నాయకులంతా కూటమి అభ్యర్ధులపై కన్నేసిన వాస్తవాన్ని గుర్తించి అప్రమత్తతతో వ్యవహరిం చాలని కోరారు. ప్రజాభిప్రాయం తమకే అనుకూలంగా ఉందనే ధీమాతో ఉన్న కూటమి నేతలు అనుకున్న విధంగా ఓట్లు వేయించుకొనేందుకు పావులు కదుపుతున్నారు. అన్ని పక్షాలు, అభ్యర్ధులు లోపాయికారీ వ్యవహారాలతో ఓటరు మద్దతు కూడగట్టకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఓటర్లను ప్రలోభపెట్టడానికి అన్ని పక్షాలు అందుబాటులో ఉన్న సాంకేతి కతను వినియోగిస్తున్నాయి. పైసల పంపిణీ, మద్యం సరఫరాకు కొత్త పద్దతు లను అవలంభిస్తున్నారు. నిఘా వర్గాల ఎత్తులకు పై ఎత్తు వేస్తూ ఓటరును ప్రలోభపెడుతున్నారు. ఎవరూ ఊహించని పద్దతులతో మద్యం, డబ్బులు ఓటర్లకు చేరవేస్తున్నారు. నిఘా వర్గాలకు పట్టుబడింది కొద్ది మాత్రమేనని, దాదాపు రూ. 1000 కోట్ల వరకు నగదు పంపిణీ జరిగి ఉంటుందని అధి కారులు భావిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వెలువ డేకన్నా ముందుగానే తెచ్చి రహస్య స్ధలాల్లో భద్రపర్చిన మద్యం గత రెండు రోజులుగా రాజకీయ పార్టీల కార్యకర్తలు, ఓటర్లకు చేరవేస్తున్నారు.  గూగుల్ యాప్ ద్వారా నగదు బదిలీ చేయడం, పేటీఎం బిల్లులు చెల్లించడం, డెలీవరీ బాయ్‌లను వినియోగించి మద్యం, డబ్బు చేరవేయడం జరుగుతుంది. నగరాలు, పట్టణాల్లో నిఘా వర్గాలు పసిగట్టలేని విధంగా ఓటర్లకు ప్రలోభాలు చేరుతున్నాయి. గ్రామాల్లో కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, రైతు సంఘాలకు ఓటుకు వెయ్యి రూపాయల చొప్పున అందచేసిన సంఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్‌లోనే దాదాపు వెయ్యి మంది ఫుడ్ డెలివరీ బాయ్‌లు అభ్యర్దులు సూచించిన చిరునామాల్లో మద్యం, డబ్బు డెలివరీ చేయడం జరిగిందని తెలుస్తోంది. డబ్బు పంపిణీపై గట్టి నిఘా ఉన్నప్పటికీ చేరే వారికి ఏదో ఒక రూపంలో చేరుతోందని అంటున్నారు. హైదరాబాద్‌తో పాటు జీవనోపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్లను  పూర్తి ఖర్చులతో సొంతూరికి తీసుకువచ్చి తమకు ఓటు వేయించుకోవడానికి కూడా అభ్యర్ధులు  ప్రత్యేక యంత్రాంగాలు, సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. 2014 ఎన్నికల ఫలితాలను పరిశీలించినట్లయితే టీఆర్‌ఎస్ 33 శాతం ఓట్లతో 63 నియోజక వర్గాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌కు 24 శాతం. టీడీపీకి14 శాతం, బీజేపీకి 7, వైసీపీకి 3 శాతం ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్, సీపీఐ కలిపి 25 శాతం ఓట్లతో 22 సీట్లు, టీడీపీ, బీజేపీ కూటమి 21 శాతం ఓట్లతో 20 సీట్లు గెలుచుకున్నాయి. ఇప్పుడు పరిస్ధితులు పూర్తిగా మారిపోయాయి. టీఆర్‌ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ప్రతిపక్షాల్లో కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ,  టీజేఎస్ కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో ఉన్నందున కూటమి ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉందంటున్నారు. అదే విధంగా గతంలో వైసీపీకి పోలైన 3 శాతం ఓట్లు టీఆర్‌ఎస్‌కు తోడైన పక్షంలో ఆ పార్టీ ఓట్లు 36 శాతానికి చేరుకునే అవకాశం ఉంది.  కేవలం 3 శాతం ఓట్ల తేడాతోనే ఫలితాలు తారుమారవుతాయనే ఆందోళన రాజకీయ పక్షాల్లో వ్యక్తమవుతుంది.

సంబంధిత వార్తలు