డేట్ ఫిక్స్ అయిందా?

Updated By ManamSun, 07/22/2018 - 00:20
dipika

Ranveer-Deepikaబాలీవుడ్ జంట రణవీర్ సింగ్, దీపికా పదుకొనే గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారన్న వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ శుభదినం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరం నవంబర్ 10న రణవీర్, దీపికా పెళ్లి చేసుకోబోతున్నారు. విరాట్ కోహ్లి, అనుష్కాశర్మలాగే ఈ జంట కూడా డెస్టినేషన్ వెడ్డింగ్‌కి ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. ఇటలీ పెళ్లి జరిగే అవకాశముందని తెలుస్తోంది. జనవరిలో దీపిక పుట్టినరోజు సందర్భంగా మాల్దీవ్స్‌లో వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇటలీలో పెళ్ళి, బెంగళూరులో వెడ్డింగ్ రిసెప్షన్ చేయనున్నారని తెలుస్తోంది.

English Title
Did the date fix?
Related News