ప్రముఖ క్రికెటర్ తండ్రి దారుణ హత్య

Updated By ManamFri, 05/25/2018 - 13:09
Dhananjaya De Silva Father Shot Dead
  • శ్రీలంక ఆల్ రౌండర్ ధనంజయ డిసిల్వ తండ్రిని కాల్చి చంపిన దుండగులు

Dhananjaya De Silva Father Shot Deadకొలంబో: శ్రీలంక ప్రముఖ క్రికెటర్, ఆల్‌రౌండర్ ధనంజయ డి సిల్వ తండ్రి.. దారుణ హత్యకు గురయ్యారు. దేహివాలా మౌంట్ లావినియా మున్సిపల్ కౌన్సిలర్ అయిన రంజన్ డి సిల్వ (62) అలియాస్ మహాథున్ గుర్తు తెలియని దుండుగులు అత్యంత సమీపం నుంచి కాల్చి చంపేశారు. గురువారం సాయంత్రం శ్రీలంక రాజధానిలోని రత్నమాల ప్రాంతంలో రాత్రి 8.30 గంటల సమయంలో ఆయన ఇంటి సమీపంలోనే కాల్చి చంపారని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. ఘటన జరిగిన వెంటనే ఆయన్ను స్థానికంగా కలుబోవిల టీచింగ్ ఆస్పత్రిలో చేర్పించగా అప్పటికే చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. దాడిలో గాయపడిన మరో ఇద్దరు వ్యక్తులకు చికిత్స చేస్తున్నారు. కాగా, తన తండ్రి మరణవార్త తెలుసుకున్న ధనంజయ డిసిల్వ.. వెస్టిండీస్ టూర్ నుంచి తప్పుకొన్నాడు. తోటి ఆటగాళ్లు ధనంజయ డిసిల్వకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అతడి తండ్రి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.

English Title
Dhananjaya De Silva Father Shot Dead
Related News