చివరి మ్యాచ్‌లోనూ తప్పని ఓటమి

Updated By ManamWed, 09/12/2018 - 00:36
Rishabh Pant
  • రాహుల్, పంత్ సెంచరీలు వృథా

  • 4-1తో సిరీస్ ఇంగ్లాండ్ వశం

panthలండన్: ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి ఐదో టెస్టులో కూడా భారత్‌కు ఓటమితప్పలేదు. 464 లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 345 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఐతు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఇంగ్లాండ్ 4-1తో సొంతం చేసుకుంది. భారత జట్టులో అసాధరణ  పోరాటం చేసిన రాహుల్ (149), రిషభ్ పంత్ (114) శతకాలు వృథా అయ్యాయి.  చివరి మ్యాచ్‌లో భారత్ 118 పరుగులతో ఓటమిపాలెంది. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ కు మూడు వికెట్లు దక్కాయి. మంగళవారం జరిగిన ఐదో రోజు ఆటలో ఓపెనర్ రాహుల్‌తో పాటు ఆరో డౌన్‌లో వచ్చిన యువ సంచలనం రిషభ్ పంత్ ఆసాధరణ ఆటతో ఆకట్టుకున్నారు. ఇంగ్లాండ్ ఈజీగా మ్యాచ్‌ను గెలుచుకుంటుందనే సమయంలో వీరు కీలకమైన బ్యాటింగ్‌తో మ్యాచ్ రూపురేఖలను తారుమారు చేశారు. మ్యాచ్‌లో ఉత్కంఠతను నెలకొల్పారు. ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకపడి సునాయాసంగా పరుగులను రాబట్టుకుంటూ స్కోరుబోర్డును పరిగెత్తిం చారు.  

అయితే చివరికి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 224 బంతుల్లో 20 ఫోర్లు, ఒక సిక్స్‌తో 149 పరుగులు చేసి రషీద్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరుకున్నాడు. పంత్‌తో కలిసి ఆరో వికెట్‌కు 204 పరుగుల కీలకమైన భాగస్వా మ్యాన్ని నెలకొల్పాడు. మంగళవారం 58/3 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా 120 పరుగుల వద్ద రహానే (37) వికెట్‌ను చేజార్చుకుంది. తర్వాత వచ్చిన హనుమా విహారి (0) ఖాతా తెరువకుండానే ఔటయ్యాడు. దీం తో భారత్ 121 పరు గులకే ఐదు వికెట్లు కోల్పోయి పీక్లతు కష్టాల్లో పడింది. అయితే ఈ సమ యంలో క్రీజులోకి వచ్చిన యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌తో కలిసి ఓపె నర్ రాహుల్ మ్యాచ్‌ను ముందుకు సాగించాడు. వీరిద్దరు మరో వికెట్ పడ కుండా జాగ్రత్తగా ఆడుతు పరుగులను రాబట్టుకున్నారు. ఇద్దరు పోటీ పడి బౌండరీలు బాదుతూ ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకు పడ్డారు. ఈ క్రమంలోనే రాహుల్ 118 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు పంత్ కూడా అర్ధ శతకం బాదాడు. ప్రత్యర్థి కెప్టెన్ ఈ జంటను విడదీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన ఫలితం దక్కలేదు. పంత్  వేగంగా ఆడుతూ సిక్స్‌లు, ఫోర్లు బాదుతూ తన కెరీర్‌లో తొలి శతకాన్ని నమోదు చేసుకొన్నాడు. మరోవైపు వీరు ఆరో వికెట్‌కు 200 పరుగులు పూర్తి చేసుకున్నారు. అయితే చివరికి రాహుల్‌ను 149 పరుగుల వద్ద రషీద్ ఔట్ చేశాడు. తర్వాత కొద్ది సేపటికే పంత్ కూడా 146 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 114 పరుగులు చేసి రషీద్ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. తర్వాత భారత్ 94.3 ఓవర్లలో 345 పరుగులకు ఆలౌటైపోయింది.

English Title
Defeat in the last match
Related News