‘ది కట్’వి పిచ్చి కథనాలు: ప్రియాంక

The Cut deleted a bizarre article that called Priyanka Chopra a ‘global scam artist’

న్యూఢిల్లీ : ప్రియుడు నిక్ జోనాస్‌ను పెళ్లాడి...హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్న ప్రియాంకా చోప్రా... వారి పెళ్లిపై ఓ న్యూయార్క్ మ్యాగజైన్‌‌కు సంబంధించిన వెబ్‌సైట్‌లో ప్రచురితం అయిన కథనంపై ఎట్టకేలకు స్పందించింది. నిక్‌ను మోసం చేసి ప్రియాంక పెళ్లి చేసుకుందని, ఆమె జగమెరిగిన మోసగత్తె అని,  కుట్ర పన్ని.. పెళ్లి పేరుతో నిక్‌ను మోసగించిదంటూ ‘ది కట్’ అనే వెబ్‌సైట్‌లో వెలువడ్డ కథనంపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ మ్యాగజైన్‌ క్షమాపణ చెప్పింది. అంతే కాకుండా ఆ కథనాన్ని వెబ్‌సైట్ డిలీట్ చేసింది. 

దీనిపై ప్రియాంక మాట్లాడుతూ...పిచ్చి కథనాలను ఎప్పుడు పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా పట్టించుకోనని స్పష్టం చేసింది. ఆ విషయం గురించి తాను మాట్లాడటం కూడా అనవసరమని... ఇటువంటి చెత్తవార్తలు తనను ఏమాత్రం డిస్టర్బ్ చేయలేవని ప్రియాంక వ్యాఖ్యానించింది. కాగా ఆ నెల 2న క్రిస్టియన్ పద్ధతిలో, 3న హిందూ సంప్రదాయం ప్రకారం ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు