మిచెల్‌కు మరో 5 రోజుల రిమాండ్ పొడిగింపు

VVIP chopper scam case, Court, extends CBI custody, Christian Michel, another 5 days
  • ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో మధ్యవర్తిగా బ్రిటన్ జాతీయుడి క్రిస్టయన్

  • సీబీఐ కస్టడీని పొడిగించిన ఢిల్లీ కోర్టు

న్యూఢిల్లీ: ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ చాపర్ కుంభకోణం కేసులో మధ్యవర్తి బ్రిటన్ జాతీయుడు క్రిస్టయన్ మిచెల్‌కు మరో ఐదు రోజుల సీబీఐ కస్టడీని ఢిల్లీ కోర్టు పొడిగించింది. సోమవారం కోర్టు ఎదుట మిచెల్ హాజరు కాగా.. విచారణకు సహకరించడం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. సీబీఐ అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలతో దాటవేసే ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపించింది. సీబీఐ 5 రోజుల కస్టడీకి ఈ నెల 5న కోర్టు మిచెల్‌ను రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఆగస్టా కుంభకోణం కేసులో మిచెల్ తొలుత బెయిల్ పిటిషన్‌ దాఖలు చేసి వెంటనే ఉపసంహరించుకున్నాడు. అనంతరం పూర్తి వివరాలతో కొత్త బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఆగస్టా కేసులో సీబీఐ అభ్యర్థన మేరకు యూఏఈ అధికారులు ఈ నెల 4న మిచెల్‌ను భారత్‌కు అప్పగించిన సంగతి విదితమే.  

సంబంధిత వార్తలు