రంగుమారుతున్న ‘రెడ్ కారిడార్’!

Updated By ManamSat, 07/21/2018 - 02:51
image

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఇటీవల మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు బి.ఎస్.ఎఫ్ జవాన్లు మరణించారు. దంతెవాడ జిల్లా పౌర్నార్ గ్రామ సర్పంచ్‌ను మావోలు నరికి చంపారు. ఇంద్రావతి నదిపై వంతెన నిర్మాణానికి సానుకూలత వ్యక్తం చేసిన పాపానికి ఆ సర్పంచ్ ప్రాణాలు కోల్పోయాడు. 
 

imageఅలాగే ఝార్ఖండ్‌లో ఒక నిర్మాణ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న నెల్లూరు వాసిని మావోయిస్టులు కాల్చి చంపారు. ఆ సంస్థ యాజమాన్యం లెవీ రూపం లో ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడంలో ఆలస్యం అయి నందుకుగాను మేనేజర్ బలయ్యాడు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా జరవండి పోలీసు స్టేషన్ పరిధిలోని సినబట్టి గ్రామానికి చెందిన ఇసరు పోటీ అనే ఆదివాసీని ‘ఇన్‌ఫార్మర్’ పేర మావోయిస్టులు కాల్చి చంపారు. కిరండల్-విశాఖపట్నం రైలుమార్గంలో మావోయిస్టులు పట్టాలు తొలగిం చడంతో గూడ్స్‌రైలు పట్టాలు తప్పింది. ఆ మార్గంలో రైళ్ళ రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇక భద్రాచలం-కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. తమ పలుకుబడి పెంచుకునేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. బిహార్‌లో కొందరు మావోయిస్టు నాయకుల ఆస్తులను ఈడి అధికారులు ఇటీవల జప్తు చేశారు. 

కొన్ని నెలల క్రితం చత్తీస్‌గఢ్, దంతెవాడ జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చి ఏడుగురు జవాన్లను బలిగొన్నారు. మొన్నటికి మొన్న ఝార్ఖండ్‌లో మందుపాతర పేల్చి ఆరుగురు జాగ్వార్ జవాన్లను హతమార్చారు. గడ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలోని ప్రభుత్వ కలప డిపోను మావోయిస్టులు దగ్ధంచేసి అపారనష్టం కలుగజేశారు. ఇట్లా అనేక రాష్ట్రాల్లో మావోయిస్టుల హింస-విధ్వంసకర కార్యక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అమాయకులు, ఆదివాసీలు, జవాన్లు కన్నుమూస్తు న్నారు. విలువైన సంపద బుగ్గిపాలవుతోంది. ఈ వాతావరణంలో జరగాల్సిన అభివృద్ధి జరగకుండా నిలిచిపోతోంది, కుంటుపడుతోంది. మహారాష్ట్ర గడ్చిరోలి అటవీ ప్రాంతంలో మావోయిస్టు దళ కమాండర్ రాకేశ్ మాట్లాడుతూ, సామ్రాజ్యవాదుల, దళారుల రక్షణగా పోలీసులు, సిఆర్‌పిఎఫ్ జవాన్లు పనిచేస్తున్నారు కాబట్టి వారిపై దాడులు చేస్తున్నామని సమర్ధించు కున్నారు. పేదల రాజ్యం సాధించడం తమ లక్ష్యమని అంతవరకు ఈ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.

అడవుల్లోని ఖనిజాలు, కలప పెట్టు బడిదారులు-దళారులు తరలించుకు పోయేందుకే ప్రభుత్వం రోడ్ల నిర్మాణా న్ని అడవుల్లో చేపడుతోందని, అందుకే ఆ నిర్మాణాలను అడ్డుకుంటున్నామని, వంతెనలు నిర్మించకుండా నిలువరిస్తున్నామని అన్నారు. ఆదివాసీలు, రైతు లపై మావోయిస్టుల పేర ప్రభుత్వం కేసులు బనాయించి, చిత్రహింసలకు గురిచేసి బాధిస్తున్నదని, అందుకే తాము ఆయుధాలతో వారికి సమా ధాన మిస్తున్నామని వివరించారు. ఈ తర్కంతోనే మావోయిస్టు నాయకులు, కమాండర్లు తమని తాము సమర్ధించుకోవడమేగాక బలపడేందుకు ప్రయ త్నిస్తున్నారు. తమ ప్రభుత్వాన్ని స్థాపించేందుకు ఈ మార్గం ఎంచు కున్నా మంటూనే అటవీ సంపద దోచుకుంటున్నందుకే హింసకు దిగుతున్నా మంటున్నారు. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల డివిజనల్ కమాండర్‌గా పనిచేసి కొంతకాలం క్రితం పోలీసులకు లొంగిపోయిన భద్రు మాటలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. మావోయిస్టుల్లో చంపటం... చనిపోవడం తప్ప మరొ కటి లేదు.

ప్రజలు వారికి భయపడి ఆశ్రయమిస్తున్నారు. ఆహారం అందిస్తు న్నారని చెప్పాడు. అతను మీడియాతో మాట్లాడుతూ, యువకులను ‘సంఘ టన్’లోకి చేర్చుకునేముందు కుటుంబ సభ్యులకు నెలనెలా కొంతడబ్బు అం దజేస్తామని వాగ్దానం చేస్తారు. అందులో చేరాక కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేయరు. సంఘటన్‌లో వెట్టిచాకిరి చేయిస్తారు. తాను పది సంవ త్సరాలు ఉద్యమంలో పనిచేసినా ఫలితం లేదు. అందుకే ప్రభుత్వానికి లొంగిపోయానని వెల్లడించాడు. అలాగే ఝార్ఖండ్‌లో పేరుమోసిన మావో యిస్టులు నకుల్, మధులు పోలీసుల ముందు లొంగిపోయాక పత్రికల వారితో మాట్లాడుతూ మావోయిస్టు పార్టీలో అంతా సవ్యంగా ఉంటే తాము జనజీవన స్రవంతిలోకి రావలసిన అవసరం ఉండేది కాదని, ఇప్పుడు ఝార్ఖండ్ అభివృద్ధి ముఖ్యమని భావిస్తున్నామని చెప్పారు. 

అందుకే అజ్ఞా తంలో ఉన్న కామ్రేడ్స్, కార్యకర్తలు సైతం జనజీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఝార్ఖండ్‌కు చెందిన మరో మావోయిస్టు నాయకు డు అభిమన్యు మాట్లాడుతూ ‘మావోయిస్టు పార్టీలో సిద్ధాంతాలు, విలువలు లుప్తమవుతున్నాయన్నారు. రైళ్ళపై దాడులు, మందుపాతరలు పేల్చడం, సమాంతరంగా ముఠాలు నడపడం, కొందరు మావోయిస్టు నాయకులు రాంచీలో మంచి మంచి బంగ్లాలు ఏర్పాటు చేసుకున్నారు, విదేశాల్లో తమ పిల్లల్ని చదివిస్తున్నారు, ఇప్పుడు గతంలో మాదిరి జమీం దారీ పద్ధతులు సమాజంలో కనిపించవు. ఇప్పుడు ఝార్ఖండ్ వికాస్ (అభి వృద్ధి) జరగాలి’ అని అంటున్నారు. ఇలా అనేక గొంతుకలు అనేక విధాలు గా వినిపిసు ్తన్నాయి. ఒకప్పుడు ‘రెడ్ కారిడార్’గా పిలిచిన ప్రాంతంలో మావోయిస్టుల కార్యక్రమాలపై ప్రశ్నార్థకాలు పెరుగుతున్నాయి. అంతర్గత కలహాలు సైతం వారి చిత్తశుద్ధిపై పెద్ద ప్రశ్నార్థకంగా నిలుపుతున్నాయి.

ఆయా ప్రాంతాల్లో గంజా యి సాగు, వ్యాపారం మాట వినిపిస్తోంది. మావోయిస్టులు గంజాయి వ్యాపారం నుంచి పెద్ద మొత్తంలో లెవీ వసూలు చేస్తున్నారని వినికిడి. ఇక చత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని లోతట్టు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ‘పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ’కి చెందిన బెటాలియన్ కమాండర్ ‘హిడ్మ’ తన ‘సామ్రాజ్యాన్ని’ ఏర్పాటుచేశాడు. అతిక్రూరంగా భద్రతా బలగాలపై మె రుపుదాడులు జరిపి పదుల సంఖ్యలో హతమార్చాడు. ఇతనిపై ప్రభుత్వం రూ.40లక్షల రివార్డును ప్రకటించింది. ఇతను వీరప్పన్ మాదిరి తనకంటూ ప్రత్యేక ముఠా ఏర్పరచు కున్నాడని, సీతూ, సోనూ, నాగేశ్ లాంటి సహచరు లతో హిడ్మా గత ఏప్రిల్‌లో సిఆర్‌పిఎఫ్ జవాన్లు భోజనాలు చేస్తుండగా దాడిచేసి 25 మందిని హతమార్చాడు. చత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ ఉన్న అటవీ ప్రాంతాలలో తలదాచుకుం టూ స్థానికులను లోబరచుకుని తన పెత్తనం కొనసాగిస్తున్నాడని అధికారులు ఆరోపిస్తున్నారు. ఝార్ఖండ్‌లోని బుడాపహాడ్ అనే అటవీ ప్రాంతంలోనూ తెలంగాణకు చెందిన సుధాకర్, అతని భార్య జయ, బిహార్‌కు చెందిన అర వింద్, ఒడిశాకు చెందిన విశ్వనాథ్ అనే మావోయిస్టుల ఆధ్వర్యంలో దాడులు జరుగుతున్నాయి. 

ప్రజా కోర్టుల పేర నిర్దోషులను సైతం కఠినంగా శిక్షించా రు. విచిత్రమేమిటంటే తమకు పాకిస్తాన్ ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు అందుతాయని చెప్పుకునే నాయకులూ ఉన్నారు. ఈ క్రమంలో బిహార్‌కు చెందిన కమాండర్ సుధీర్ భగత్, శివ్‌లాల్ యాదవ్ లాంటి మావోయిస్టు నాయకులు అరెస్టయ్యారు. మావోయిస్టుల ప్రభావం ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విస్తృతంగా ఉన్నప్పటికీ ప్రధాని మోదీ అనేక బహిరంగ సభల్లో ప్రసంగించి ఎన్నో అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టారు. కుంటిలాంటి జిల్లా కేంద్రంలోనూ ప్రధాని బహిరంగ సభలో పాల్గొన్నారు. భారీఎత్తున తరలివచ్చిన ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. గంధపు చెక్కల స్మగ్లర్ వీర ప్పన్ ఆటకట్టించిన విజయ కుమార్‌ను ఇప్పుడు సిఆర్‌పిఎఫ్ ఉన్నతాధికారిగా నియమితులు కావడంతో ఆయన నేతృత్వంలో కొత్త వ్యూహాలు పన్నుతు న్నారు. అవి ఫలితాలనిస్తున్నాయని చెబుతున్నారు. ఆధునిక సాంకేతికత ముఖ్యంగా కమ్యూనికేషన్లను అడవిలోకి తీసుకెళుతున్నారు. పెద్ద ఎత్తున టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని చత్తీస్‌గఢ్‌లో ఉక్కుఫ్యాక్టరీకి శంకు స్థాపన చేయడం, ఇంటింటికి ఇంటర్నెట్ అందించేందుకుగాను ఫైబర్ కేబు ల్‌ను గ్రామగ్రామానికి అందిస్తున్న కారణంగా నిజంగా రెడ్ కారిడార్ రంగు వెలిసిపోతున్న ఛాయలు కనిపిస్తున్నాయి.

- వుప్పల నరసింహం
9985781799

English Title
color changing of 'red corridor'
Related News